Aryan Khan : ఆర్య‌న్ ఖాన్ విష‌యంలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న షారూఖ్ ఖాన్‌..!

November 17, 2021 5:34 PM

Aryan Khan : డ్ర‌గ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) చేత అరెస్టు కాబ‌డి ఆ త‌రువాత 20 రోజుల‌కు పైగా జైలులో ఉన్న ఆర్య‌న్ ఖాన్ ఎట్ట‌కేల‌కు అక్టోబ‌ర్ 29వ తేదీన బెయిల్‌పై విడుద‌ల అయ్యాడు. ఎంతో మంది సీనియ‌ర్ లాయ‌ర్లు కేసును వాదించిన‌ప్ప‌టికీ బెయిల్ తేలేక‌పోయారు. దీంతో సుప్రీం కోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది, మాజీ అటార్నీ జ‌న‌ర‌ల్ ముకుల్ రోహ‌త్గీ కేవ‌లం 2 రోజుల్లోనే ఆర్య‌న్ ఖాన్‌కు బెయిల్ వ‌చ్చేలా చేశారు.

shahrukh khan taking very much care for Aryan Khan

అయితే జైలు నుంచి విడుద‌ల అయ్యాక ఆర్య‌న్ ఖాన్ ప‌ట్ల షారూఖ్ ఖాన్ చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. త‌న ప‌ర్స‌న‌ల్ బాడీ గార్డ్ ర‌వి సింగ్‌ను ఆర్య‌న్ ఖాన్‌కు ఏర్పాటు చేశాడు. ఈ క్ర‌మంలోనే షారూఖ్ త‌న కోసం ఇంకో కొత్త బాడీ గార్డ్‌ను నియ‌మించుకునే ప‌నిలో ఉన్నాడు.

ఇక ఆర్య‌న్ ఖాన్ వ‌ల్ల ఇప్ప‌టికే చాలా రోజుల నుంచి షారూఖ్ తాను చేస్తున్న సినిమాల షూటింగ్‌కు వెళ్ల‌డం లేదు. దీంతో ఎంతో షెడ్యూల్ వెనుక‌బ‌డింది. అయితే ఆర్య‌న్ ఖాన్‌తో షారూఖ్ మ‌రికొన్ని రోజులు ఇంట్లోనే గ‌డ‌ప‌నున్నారు. ఈ క్ర‌మంలోనే తాను చేస్తున్న సినిమాల షెడ్యూల్‌ను కొద్దిగా మార్చ‌మ‌ని షారూఖ్ చిత్ర యూనిట్ల‌ను కోరారు.

త‌న‌కు సంబంధం లేని సీన్ల‌ను చిత్రీక‌రించేట‌ప్పుడు తన అవ‌స‌రం ఉండ‌దు క‌నుక ఆ స‌మ‌యంలో క‌చ్చితంగా ఆర్య‌న్‌తో ఉండాల‌ని షారూఖ్ నిర్ణ‌యించుకున్నాడు. ఈ క్ర‌మంలోనే సీన్ల చిత్రీక‌ర‌ణ అందుకు త‌గిన విధంగా మార్చాల‌ని కోరాడ‌ట‌. దీంతో ఎక్కువ స‌మ‌యం పాటు ఫ్యామిలీతో.. ముఖ్యంగా ఆర్య‌న్‌తో గ‌డిపే స‌మ‌యం ల‌భిస్తుంది.

ఇక షారూఖ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. దీపికా ప‌దుకునే, జాన్ అబ్ర‌హామ్‌ల‌తో క‌లిసి ప‌ఠాన్ అనే సినిమాలో షారూఖ్ న‌టిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now