Anchor Vishnu Priya : వామ్మో.. విష్ణు ప్రియ ఏం తిప్పుడు తిప్పింది.. ఆ తిప్పుడేమిటి..?

May 25, 2022 6:44 PM

Anchor Vishnu Priya : ప్ర‌స్తుత త‌రుణంలో సోష‌ల్ మీడియా ప్ర‌భావం ఎంత ఉందో అంద‌రికీ తెలిసిందే. అందులో చాలా మంది విహ‌రిస్తున్నారు. దీని వ‌ల్ల సెల‌బ్రిటీలు అందులో రోజూ పోస్టులు పెడుతూ అల‌రిస్తున్నారు. ఇంకోవైపు రోజు రోజుకీ ఫాలోవ‌ర్ల‌ను కూడా పెంచుకుంటున్నారు. ఇక ఇలాంటి వారిలో విష్ణు ప్రియ ముందే ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ఈమె సోష‌ల్ మీడియాలో చేస్తున్న సంద‌డి మామూలుగా ఉండ‌డం లేదు. అనేక పాట‌ల‌కు స్టెప్పులేస్తూ అల‌రిస్తుంటుంది. ఇక లేటెస్ట్‌గా మ‌రో పాట‌కు డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంది.

యాంక‌ర్‌గా ప్ర‌స్తుతం పెద్ద‌గా అవ‌కాశాలు లేక‌పోయిన‌ప్ప‌టికీ విష్ణు ప్రియ సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. ప‌లు బ్రాండ్ల‌కు చెందిన ఉత్ప‌త్తుల‌ను ప్ర‌మోట్ చేయ‌డంతోపాటు అప్పుడ‌ప్పుడు త‌న గ్లామ‌ర్ ఫొటోల‌ను కూడా ఈమె షేర్ చేస్తుంటుంది. దీంతో ఆ ఫొటోలు వైర‌ల్ అవుతుంటాయి. ఇక ఈమె మంచి డ్యాన్సర్ అన్న విష‌యం తెలిసిందే. అందుక‌నే లేటెస్ట్ మూవీల్లోని పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేస్తూ అల‌రిస్తుంటుంది.

Anchor Vishnu Priya latest dance video viral
Anchor Vishnu Priya

విష్ణు ప్రియ తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియో వైర‌ల్‌గా మారింది. అందులో ఆమె న‌డుమును తిప్పుతూ రెచ్చ‌గొట్టేలా డ్యాన్స్ చేసింది. ఆమె తిప్పిన తిప్పుడుకు కుర్ర‌కారు మైమ‌రిచిపోతున్నారు. అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ విష్ణు ప్రియ చేసిన డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె డ్యాన్స్ వీడియో వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now