Anchor Vishnu Priya : మగాళ్లు వాటిని కంట్రోల్ చేసుకోవాలి.. విష్ణుప్రియ సంచలన కామెంట్స్..

September 22, 2022 5:00 PM

Anchor Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ అందరికీ సుపరిచితమే. పోవే పోరా షోతో విష్ణుప్రియకు మంచి గుర్తింపు వచ్చింది. విష్ణు ప్రియకు సోషల్ మీడియాలో బీభత్సమైన క్రేజ్ ఉంది. ఆమె నడుము తిప్పుడు.. బెల్లీ డాన్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది. ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ తో కలిసి యాంకర్ విష్ణు ప్రియ అదిరిపోయే స్టెప్పులేసింది. తన అందాలను ఆరబోస్తూ దుమ్మురేపేలా చిందులేసింది. జరీ జరీ పంచెకట్టి.. అంటూ ఊర మాస్ సాంగ్ లో మానస్ తో కలిసి కుర్రకారు మతులు పోగొట్టింది.

మాస్ ఆడియన్స్ మెచ్చే బీట్ తో అందిరినీ ఆకట్టుకుంటుంది. ప్రముఖ రచయిత సుద్ధాల అశోక్ తేజ రాసిన ఈ పాటను శ్రావణ భార్గవి, సాకేత్, స్ఫూర్తి అద్భుతంగా పాడారు. ఈ పాటకు తగినట్లుగా శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. అదిరిపోయే సెట్ లో అదుర్స్ అనిపించేలా ఇద్దరూ స్టెప్స్ వేశారు. ఈ పాటలో విష్ణు ప్రియ చాలా కొత్తగా కనిపించింది. సాంప్రదాయ వస్త్రధారణలోనే ఎంతో అందంగా.. అంతకు మించి గ్లామర్‌ తో ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది.

Anchor Vishnu Priya sensational comments on movie industry
Anchor Vishnu Priya

తాజాగా విష్ణు ప్రియ కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ.. అన్ని ఇండస్ట్రీల్లోనూ అలానే ఉంటుందని, తనను కూడా కొంతమంది కమిట్మెంట్లు అడిగారని, కానీ తనకు అలాంటివి నచ్చవని చెప్పుకొచ్చింది. ఇది పురుషాధిక్య సమాజం.. వాళ్లు హార్మోన్లు కంట్రోల్ చేసుకోవాలి.. అని విష్ణుప్రియ కాస్త నాటీ కామెంట్లు చేసింది. దీంతో విష్ణుప్రియ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె నటించిన వాంటెడ్ పండుగాడ్ చిత్రం దారుణంగా బెడిసి కొట్టేసింది. కానీ ఇప్పుడు ఈ పాటతో ఒక్కసారిగా ఆమె పేరు మార్మోగిపోతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now