గురువారం, జూన్ 11, 2026
వినోదం

ఓటీటీలో అడివి శేష్ ‘డెకాయిట్’ ప్రభంజనం.. ప్రైమ్ వీడియోలో నంబర్-1 ట్రెండింగ్!

అడివి శేష్ నటించిన డెకాయిట్ సినిమా థియేటర్ల తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలో కూడా సంచలనం సృష్టిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా నంబర్-1 స్థానంలో ట్రెండ్ అవుతోందని సినీ వర్గాలు వెల్లడించాయి.

ఓటీటీలో అడివి శేష్ ‘డెకాయిట్’ ప్రభంజనం.. ప్రైమ్ వీడియోలో నంబర్-1 ట్రెండింగ్!
అమెజాన్ ప్రైమ్ వీడియోలో దేశవ్యాప్తంగా నంబర్-1 స్థానంలో ట్రెండ్ అవుతున్న ‘డెకాయిట్’. Photo Credit: Amazon Prime Video India/X.
Decoyt movie poster featuring Adivi Sesh and Mrunal Thakur on Amazon Prime Video.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో దేశవ్యాప్తంగా నంబర్-1 స్థానంలో ట్రెండ్ అవుతున్న ‘డెకాయిట్’. Photo Credit: Amazon Prime Video India/X.

అడివి శేష్ నటించిన డెకాయిట్ సినిమా థియేటర్ల తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలో కూడా సంచలనం సృష్టిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా నంబర్-1 స్థానంలో ట్రెండ్ అవుతోందని సినీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా థియేటర్లలో మంచి ఆదరణ పొందిన తర్వాత ఓటీటీలో కూడా భారీ స్పందన రావడం చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నాయి. డెకాయిట్: ఎ లవ్ స్టోరీ చిత్రానికి షనీల్ డియో దర్శకత్వం వహించారు. అడివి శేష్ కథా రచనలో కూడా భాగస్వామ్యం కావడం విశేషం. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించారు. ప్రకాశ్ రాజ్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. ప్రేమ, ప్రతీకారం, యాక్షన్ మేళవింపుతో రూపొందిన ఈ సినిమా విడుదల సమయంలో ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ చర్చకు దారితీసింది.

శేష్ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు..

సినిమా మొదట ఉగాది, ఈద్ సందర్భంగా మార్చి 19న విడుదల కావాల్సి ఉండగా, భారీ సినిమాల పోటీ కారణంగా ఏప్రిల్ 10కి వాయిదా వేశారు. విడుదల తర్వాత అడివి శేష్ కెరీర్‌లోనే ఇది అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచిందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.54 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కమర్షియల్ సక్సెస్‌గా నిలిచిందని సమాచారం. ఓటీటీ విడుదల హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. మే 8 నుంచి ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. హిందీ వెర్షన్ మాత్రం ఇంకా విడుదల కాలేదు. ఓటీటీకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్ స్థానానికి చేరుకోవడం సినిమా రీచ్‌ను మరింత పెంచిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

యాక్ష‌న్ ఎపిసోడ్స్‌కు ప్రేక్ష‌కులు ఫిదా..

సోషల్ మీడియాలో కూడా డెకాయిట్ పై చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా అడివి శేష్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ పాత్ర, విజువల్ టోన్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని కామెంట్లు వస్తున్నాయి. కొంతమంది ప్రేక్షకులు సినిమాను టెక్నికల్‌గా స్టైలిష్ థ్రిల్లర్ గా అభివర్ణిస్తుండగా, మరికొందరు కథనం కొన్ని చోట్ల నెమ్మదించిందని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ సినిమా ఓటీటీలో భారీ వ్యూయర్‌షిప్‌ను నమోదు చేస్తోందని కథనాలు వెల్లడించాయి. డెకాయిట్ విజయానంతరం అడివి శేష్ తన కెరీర్‌లో కొత్త దశలోకి అడుగుపెడుతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. యాక్షన్ థ్రిల్లర్స్‌కు ప్రసిద్ధి చెందిన ఆయన, ఇప్పుడు రెండు రొమాంటిక్ డ్రామాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. భావోద్వేగ కథలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారని సినీ కథనాలు తెలిపాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి