గురువారం, జూన్ 11, 2026
ఆరోగ్యం

Turmeric Benefits : ప‌సుపును రోజూ తీసుకుంటే క‌లిగే 7 అద్భుత‌మైన లాభాలు ఇవే..!

Turmeric Benefits : ఆరోగ్యనికి, పసుపు ఎంతగానో మేలు చేస్తుంది. పసుపు వలన అనేక లాభాలు ఉంటాయి. పసుపులో చక్కటి గుణాలు ఉంటాయి. వివిధ రకాల అనారోగ్య సమస్యలను, పసుపు దూరం చేయగలదు. పసుపుని రోజూ ఎందుకు తీసుకోవాలి…

Turmeric Benefits : ప‌సుపును రోజూ తీసుకుంటే క‌లిగే 7 అద్భుత‌మైన లాభాలు ఇవే..!

Turmeric Benefits : ఆరోగ్యనికి, పసుపు ఎంతగానో మేలు చేస్తుంది. పసుపు వలన అనేక లాభాలు ఉంటాయి. పసుపులో చక్కటి గుణాలు ఉంటాయి. వివిధ రకాల అనారోగ్య సమస్యలను, పసుపు దూరం చేయగలదు. పసుపుని రోజూ ఎందుకు తీసుకోవాలి అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. కానీ, నిజానికి పసుపు వలన కలిగే లాభాలను చూశారంటే, కచ్చితంగా రోజూ పసుపును తీసుకుంటూ ఉంటారు. మన వంటల్లో కూడా, చక్కగా పసుపును వాడుకోవచ్చు. పసుపులో కార్క్యుమిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. దానిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అద్భుతంగా ఉంటాయి.

ఇంఫ్లమేషన్ ని దూరం చేయగలదు. పసుపుతో గుండె సమస్యలు కూడా వుండవు. క్యాన్సర్, ఆర్థరైటిస్ సమస్యలని పసుపు పోగొడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా, ఇందులో ఎక్కువ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ వలన కలిగే హాని నుండి మనల్ని రక్షిస్తుంది. మన ఆరోగ్యం పూర్తిగా బాగుండడానికి కూడా పసుపు తోడ్పడుతుంది. పసుపుని తీసుకోవడం వలన, జాయింట్ పెయింట్స్ వంటివి కూడా తగ్గిపోతూ ఉంటాయి.

7 Turmeric Benefits taking it daily
Turmeric Benefits

రోజు పసుపును తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. గుండె ఆరోగ్యానికి కూడా పసుపు ఎంతగానో మేలు చేస్తుంది. పసుపును తీసుకోవడం వలన, బీపీ కంట్రోల్ అవుతుంది. హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు. క్యాన్సర్ రాకుండా కూడా, పసుపు చూసుకుంటుంది. యాంటీ క్యాన్సర్ గుణాలను పసుపు కలిపి ఉంటుంది. క్యాన్సర్ కి కారణమయ్యే వాటిని అడ్డుకోవడానికి, పసుపు బాగా ఉపయోగపడుతుంది. కీమోథెరపీ చేయించుకునే వాళ్ళకి కూడా పసుపు చక్కటి ప్రభావం చూపిస్తుంది.

క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. పసుపును తీసుకోవడం వలన అల్జీమర్స్ సమస్య నుండి కూడా బయటపడొచ్చు. మెదడు సంబంధిత సమస్యలకు, దూరంగా ఉండవచ్చు. మెదడు పనితీరు కూడా పసుపుతో బాగుంటుంది. పసుపుని డైట్ లో చేర్చుకోవడం వలన, అజీర్తి సమస్యలు కూడా తగ్గిపోతాయి. స్టమక్ అప్సెట్, ఇరిటెబుల్ బౌల్ సిండ్రోమ్ వంటివి తగ్గిపోతాయి. ఇలా, అనేక లాభాలని మనం పసుపుతో పొందవచ్చు. కాబట్టి. పసుపుని రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. పాలల్లో పసుపు వేసుకుని తీసుకోవడం, కూరల్లో వాటిల్లో పసుపుని వేసుకోవడం, కూరలతో పండ్లతో స్మూతీ చేసినప్పుడు పసుపు వేసుకోవడం, సూప్స్ లో కూడా పసుపు వేసుకోవడం మంచిదే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.