వంటింటి మసాలలతో రోగనిరోధక శక్తిని పెంచుకోండిలా!

April 19, 2021 1:17 PM

ప్రస్తుత కాలంలో మన ఒంట్లో కొంచెం నలతగా ఉంటే చాలు వెంటనే ఇంగ్లీష్ మందులను వేసుకుని ఉపశమనం పొందుతాము. అయితే ఆ ఉపశమనం కేవలం తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తుంది. కానీ ఈ విధంగా తరచు మనం అనారోగ్యానికి గురి కాకుండా శాశ్వతంగా అనారోగ్యాన్ని తగ్గించే ఔషధ గుణాలు మన వంటింట్లోనే ఉన్నాయనే విషయం మర్చిపోయారు. అయితే కరోనా ప్రభావం వల్ల చాలామంది మన వంటింట్లో దొరికే మసాలా దినుసులతో ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. మన వంటింట్లో దొరికే మసాలా దినుసులలో ఉన్న ఔషధ గుణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

* పసుపు: పసుపు ఎన్నో ఔషధ గుణాల నిలయం అని చెప్పవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి.ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలలో పసుపు కలుపుకుని తాగడం ద్వారా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.

* మిరియాలు: ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా మిరియాలు వేసి బాగా మరిగించాలి. ఈ మిరియాలతో పాటు కొద్దిగా పసుపు, తులసి ఆకులను వేయడం ద్వారా వాటిలో ఉన్న పోషకాలు నీటి ద్వారా మన శరీరంలోనికి గ్రహించబడి మనకు రోగనిరోధక శక్తిని అందిస్తాయి.

* మన వంటింట్లో దొరికే వాము, జీలకర్ర, మెంతులు వంటి దినుసులు జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అదేవిధంగా మన శరీరానికి ఒత్తిడిని తగ్గించే హార్మోన్ లను విడుదల చేయడంలో దోహదపడతాయి. ఈ విధమైన మసాలాదినుసులన్నింటినీ కలిపి బాగా మరిగించి కషాయం తయారుచేసుకొని ప్రతి రోజూ ఒక గ్లాస్ తాగటం ద్వారా రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment