Turmeric : చిటికెడు పసుపు.. బోలెడన్ని ప్రయోజనాలు..!

March 17, 2022 9:49 AM

Turmeric : పసుసును భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. అయితే వాస్తవానికి దీనికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. పసుపు అనేక వ్యాధులను నయం చేసే వర ప్రదాయని అని ఆయుర్వేదం చెబుతోంది. ఈ క్రమంలోనే పసుపు వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

take a small amount of Turmeric everyday for these benefits
Turmeric

1. రోజూ రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్‌ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా పసుపులో ఉండే కర్‌క్యుమిన్‌ మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. డిప్రెషన్‌ నుంచి బయట పడేస్తుంది. మానసిక ప్రశాంతతను అందిస్తుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

2. పాలలో పసుపు కలుపుకుని తాగడం వల్ల గుండె సురక్షితంగా ఉంటుంది. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.

3. పాలలో పసుపు కలుపుకుని తాగితే క్యాన్సర్‌ కణాలు వృద్ధి చెందవు. అలాగే క్యాన్సర్‌లు రాకుండా ఉంటాయి.

4. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. కనుక పసుపును పాలలో కలిపి తాగితే కీళ్లనొప్పులు, వాపులు తగ్గుతాయి. ఆర్థరైటిస్‌ ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.

5. పసుపును తీసుకుంటే మతిమరుపు సమస్య తగ్గుతుంది. దీన్ని గాయాలు, పుండ్లపై రాస్తే త్వరగా అవి మానుతాయి. అలాగే పాలలో పసుపు కలిపి తాగడం వల్ల షుగర్‌ లెవల్స్‌, కొలెస్ట్రాల్‌ లెవల్స్‌, హైబీపీ తగ్గుతాయి. అలాగే ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now