కరోనా టీకా తరువాత జ్వరం ఎందుకు వస్తుందో తెలుసా ?

June 10, 2021 10:52 PM

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కొందరిలో కొన్ని లక్షణాలు తలెత్తుతున్నాయి. కొందరిలో సాధారణమైన తలనొప్పి, జ్వరం రావడం, మరికొందరిలో వళ్ళు నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.ఈ విధమైనటువంటి సమస్యలు రావడం వల్ల చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. ఈక్రమంలోనే వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల జ్వరం ఎందుకు వస్తుంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా మనం టీకా తీసుకున్నప్పుడు మన శరీరంలో రోగనిరోధకశక్తి పునరుత్తేజం అవుతుంది. అందువల్ల ఈ విధమైనటువంటి లక్షణాలు మనలో కనబడతాయి. ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి సహజ వ్యవస్థ… ఈ వ్యవస్థ మన శరీరంలోకి ఏదైనా ప్రవేశించిందని గుర్తించిన వెంటనే ఈ వ్యవస్థ ప్రతిస్పందించడం మొదలుపెడుతుంది. అందుకోసమే మనం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు తెల్ల రక్త కణాలు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని పనిని ప్రారంభించడం మొదలుపెడతాయి. ఆ సమయంలోనే మనం టీకా వేసుకున్న భాగంలో కొద్దిగా నొప్పి, తిమ్మిరిగా ఉండటం, అలసట, జ్వరం వంటి లక్షణాలు కనపడతాయి.

రోగనిరోధక వ్యవస్థలో రెండవ భాగం సముపార్జిత వ్యవస్థ.. మనం టీకా వేసుకోగానే సముపార్జిత వ్యవస్థను చైతన్యపరిచడం వల్ల అసలైన ప్రక్రియ అప్పుడే మొదలయ్యాయి మన శరీరంలో కరోనా వైరస్ కు వ్యతిరేకంగా యాంటీబాడీలు ఉత్పత్తి కావడం మొదలవుతాయి. ఈ యాంటీబాడీలు మనకు వైరస్ నుంచి పూర్తిగా విముక్తి కలిగిస్తాయి.ఈ విధంగా కరోనా టీకా తీసుకున్నప్పుడు కనిపించే ఈ లక్షణాలు కేవలం కొన్ని గంటలు లేదా రెండు రోజుల వరకు మాత్రమే ఉంటాయని,ఇలాంటి వాటికి భయపడకుండా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి అని అధికారులు తెలియజేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now