
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సినిమా భారీ విజయం సాధించడంతో పార్ట్-2పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత ఏడాది సెప్టెంబర్‌లో చిత్ర నిర్మాతలు దీపికా పదుకొణె కల్కి 2లో భాగం కాదని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆమె స్థానంలో ఎవరు నటిస్తారు అనే అంశంపై అప్పటి నుంచి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజా గా సోషల్ మీడియాలో, ముఖ్యంగా రెడిట్ వేదికగా, దీపిక స్థానంలో సాయి పల్లవిని ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయినప్పటికీ ఈ వార్త ప్రస్తుతం అభిమానులు, సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది.
రెడిట్‌లో నెటిజన్ల స్పందన..
ఈ వార్తపై రెడిట్‌లో నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక యూజర్ ఇలా అన్నాడు. పార్ట్-1లో మరణించిన ఒక పాత్ర సాయి పల్లవిలా కనిపించే నటితో చేశారు. ఇప్పుడు ఆమెను తీసుకుంటే ప్రేక్షకులకు కన్ఫ్యూజన్ రావొచ్చు. మరో నెటిజన్ వ్యంగ్యంగా స్పందిస్తూ, ప్రభాస్ ఫ్యాన్‌బేస్‌ను మెప్పించడానికే ఎక్కువ స్క్రీన్ టైమ్ కేటాయించే సినిమాల్లో సాయి పల్లవికి చిన్న పాత్ర దక్కుతుంది. అభినందనలు!, అంటూ కామెంట్ పెట్టాడు. ఇంకొకరు ఇలా అభిప్రాయపడ్డారు, దీపిక పాత్ర ప్రసవ సమయంలో మరణిస్తుందని, ఆ బిడ్డను సాయి పల్లవి పెంచే యోధురాలిగా చూపిస్తారేమో. దేవకీ-యశోద కథలా, కల్కిని పెంచే పాత్రగా ఆమెను చూపించి, విష్ణువు పదవ అవతారంగా కథను కొనసాగిస్తారని అనుకుంటున్నాను, అన్నాడు. కాగా ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాయి పల్లవి రాబోయే సినిమాలు..
సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె బాలీవుడ్‌లో ఏక్ దిన్ సినిమాతో అరంగేట్రం చేయనున్నారు. ఈ చిత్రం మే 1, 2026న విడుదల కానుంది. ఇందులో జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. అలాగే రామాయణం పార్ట్-1, పార్ట్-2 చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న మణిరత్నం కొత్త ప్రాజెక్ట్‌లో కూడా సాయి పల్లవిని ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అయితే కల్కి 2 లో సాయి పల్లవి నిజంగా నటిస్తారా? ఆమె పాత్ర ఏంటి? అనే విషయాలపై ఇప్పటివరకు చిత్ర బృందం మౌనం పాటిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అంతవరకు ఈ వార్త ఊహాగానాల స్థాయిలోనే ఉన్నప్పటికీ, కల్కి 2పై ఆసక్తిని మరింత పెంచే అంశంగా మారింది.








