
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్‌లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలకు ప్రధాని మోదీ వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా కాలంగా ఈ ఇద్దరూ రిలేషన్షిప్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే తమ పెళ్లి వరకు ఈ విషయాన్ని వారు అధికారికంగా చెప్పలేదు. కానీ సడెన్‌గా ఇటీవలే పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ వివాహ కార్యక్రమానికి చిత్ర పరిశ్రమతోపాటు పలు ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలు, ప్రముఖులను కూడా వీరు ఆహ్వానించారు. అందులో భాగంగానే ప్రధాని మోదీని కూడా తమ పెళ్లికి ఆహ్వానించారు. అయితే ఆయన ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో నూతన వధూవరులకు లేఖ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ కార్యాలయం విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న దంపతులకు ఓ లేఖను పంపించింది. అందులో ప్రధాని మోదీ స్వయంగా సంతకం చేసి తన శుభాకాంక్షలను తెలియజేయడం విశేషం.
ప్రధాని మోదీ శుభాకాంక్షలు..
విజయ్ – రష్మికల వివాహ వేడుకకు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందకరమైన, శుభకరమైన సందర్భంలో దేవరకొండ, మందన్న కుటుంబాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. అని మోదీ తన లేఖలో తెలిపారు. విజయ్ – రష్మికల జీవితంలో ఇదొక కొత్త, అందమైన అధ్యాయానికి ఆరంభం. సఖాసప్తపదా భవ అనే స్ఫూర్తితో ఏడడుగులు వేస్తున్న ఈ జంట జీవితాంతం స్నేహితులుగా కలసి ఉండాలని కోరుకుంటున్నా. ఉమ్మడి కలలతో వాటిని నెరవేర్చుకుంటూ, రానున్న కాలం అంతా కలసి మెలసి ఉండాలని ఆకాంక్షిస్తున్నా. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నిజమైన భాగస్వాములుగా వారి జీవిత ప్రయాణం సాగాలి. ఈ ఆనంద సమయంలో ఆ జంటతోపాటు వారి కుటుంబ సభ్యులకు కూడా నా ఆశీస్సులు, శుభాకాంక్షలు.. అని మోదీ తన లేఖలో రాశారు. కాగా మోదీ రాసిన ఈ లేఖ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీస్సులు అందించిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు#NarendraModi #VijayDeverakonda #RashmikaMandanna #Virosh #TheWeddingOfVirosh pic.twitter.com/aY7ob3LBWy
— Sai Satish (@PROSaiSatish) February 25, 2026
ఆ సినిమాతోనే ప్రేమలో..?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పలు చిత్రాల్లో కలసి నటించారు. వీరు కలసి యాక్ట్ చేసిన గీత గోవిందం మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఎక్కువగా కనెక్ట్ అయింది. అయితే ఈ చిత్రం తరువాతనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాత వీరు మీడియా కంట పడకుండా పలు సార్లు మాల్దీవ్స్ వంటి దేశాలకు ట్రిప్పులు కూడా వేసి వచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక పలు సందర్భాల్లో వీరి రిలేసన్షిప్పై కొందరు సెలబ్రిటీలు బహిరంంగానే వీరికి ప్రశ్నలు సంధించారు. కానీ వీరు అప్పట్లో సమాధానం చెప్పలేదు. అలా అని ఖండించలేదు. అయితే చివరకు ఇటీవలే పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు. కానీ అప్పటికే వీరి పెళ్లి జరుగుతుందని వార్తలు వ్యాపించాయి. ఆ తరువాత వారు అధికారికంగా కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే వారు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ కార్యక్రమానికి మీడియాకు కూడా అనుమతి లేదని సమాచారం.












