రహస్యంగా పెళ్లి చేసుకున్నారా? ఆ వైరల్ ఫోటోలపై క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్!

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్ తాజాగా తన పెళ్లిపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టారు. మంగళసూత్రం, ఆకుపచ్చ గాజులు ధరించిన ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కంగనా రహస్యంగా పెళ్లి చేసుకుందని ప్రచారం మొదలైంది.

మే 24, 2026 1:28 సా.
Actress Kangana Ranaut in a traditional married woman look from her movie shoot.
తన పెళ్లి వార్తలపై వస్తున్న రూమర్లను ఖండించిన కంగనా రనౌత్. Photo Credit: Kangana Ranaut/X/Instagram.

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్ తాజాగా తన పెళ్లిపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టారు. మంగళసూత్రం, ఆకుపచ్చ గాజులు ధరించిన ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కంగనా రహస్యంగా పెళ్లి చేసుకుందని ప్రచారం మొదలైంది. ఈ వార్తలపై స్పందించిన కంగనా, అవి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కావని స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో భాగంగా ఆ లుక్‌లో ఉన్నానని తెలిపారు. తాను ప్రతిరోజూ సిటీలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నాన‌ని, ఎవరో క్యారెక్టర్ మేకప్‌లో ఉన్నప్పుడు ఫొటో తీశార‌ని, ఇప్పుడు త‌న‌కు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయ‌ని తెలిపారు. కానీ మ్యారీడ్ ఉమ‌న్ లుక్‌లో ఉండటం అంత పెద్ద విషయం ఏమిటి? అంటూ ఆమె ప్ర‌శ్నించారు.

ఆ విష‌యాన్ని దాచి పెట్ట‌ను: క‌ంగ‌నా

అలాగే, జీవితంలో ఇంత పెద్ద విషయాన్ని ఎప్పటికీ దాచిపెట్టనని అభిమానులకు కంగ‌నా హామీ ఇచ్చారు. యాక్టర్స్ అన్ని రకాల పాత్రలు పోషిస్తార‌ని, తాను సీక్రెట్‌గా పెళ్లి చేసుకోన‌ని, ప్రామిస్ చేసి చెబుతున్నాన‌ని కంగనా అన్నారు. ఇటీవలి కాలంలో ఓ యువ రాజకీయ నాయకుడితో కంగనా రిలేషన్‌లో ఉన్నారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఆ వార్తలపై మాత్రం ఆమె ప్రత్యక్షంగా స్పందించలేదు. ఇక కంగ‌నా ర‌నౌత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆమె సినిమాల్లోనే కాదు, రాజ‌కీయాల్లోనూ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను అనేక అంశాల‌పై నిల‌దీయ‌డంతోపాటు బాలీవుడ్‌లో కొన‌సాగుతున్న నెపోటిజం, ఏక ఛ‌త్రాధిప‌త్యం వంటి అంశాల‌పై ఆమె త‌రచూ త‌న గ‌ళం వినిపిస్తూనే ఉంటారు. ఆమె ప్ర‌స్తుతం సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేక‌పోయినా రాజ‌కీయాల్లో మాత్రం చాలా చురుగ్గానే ఉన్నారు.

సినిమాల్లోనూ బిజీగానే..

హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కంగ‌నా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు పొందారు. ఆమె న‌టించిన అనేక చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్‌గా నిలిచాయి. ముక్కు సూటిగా మాట్లాడే మ‌న‌స్త‌త్వంతో ఆమె ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వ‌చ్చిన ఆమె బాలీవుడ్‌లో గ‌తంలో హీరోయిన్ గా చ‌క్రం తిప్పారు. ఆమె కెరీర్ మంచి పీక్స్‌లో ఉండగానే బాలీవుడ్‌పై అనేక విమ‌ర్శ‌లు చేసి వార్త‌ల్లో నిలిచారు. అప్ప‌ట్లో ఆమె నిర్మాత‌లు, హీరోల గురించి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపాయి. త‌రువాత ఆమె అనూహ్యంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి బీజేపీ త‌ర‌ఫున పోటీ చేసి ఎంపీ అయ్యారు. ప్ర‌స్తుతం ఆమె న‌టిస్తున్న భార‌త భాగ్య విధాత చిత్రం జూన్ 12న రిలీజ్ కానుంది. కంగ‌నా చివ‌రిసారిగా ఎమ‌ర్జెన్సీ అనే చిత్రంలో మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ పాత్ర‌లో న‌టించారు. ప్ర‌స్తుతం రిలీజ్ కానున్న మూవీతో పాటు క్వీన్ 2, స‌ర్కిల్ అనే మ‌రో రెండు మూవీలు ఆమె చేతిలో ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment