t20 world cup 2026

Sri Lanka captain Dasun Shanaka during a press conference addressing fan threats.

శ్రీలంక ఆటగాళ్లకు ప్రాణగండం? రక్షణ కల్పించాలని కెప్టెన్ శనక వేడుకోలు!

Thursday, 26 February 2026, 5:01 PM

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నీ సూప‌ర్ 8 ద‌శ‌లో వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల‌ను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన నేప‌థ్యంలో ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున నిర‌స‌నలు సెగ‌లు వ‌స్తున్నాయ‌ని, ఆట‌గాళ్ల‌కు ప్ర‌భుత్వం ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని శ్రీ‌లంక టీ20ఐ జ‌ట్టు కెప్టెన్ ద‌సున్ శ‌న‌క కోరాడు.

Ravi Shastri analyzing India's performance against South Africa in T20 World Cup 2026.

ఓటమి మంచిదే.. టీమిండియాపై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు..

Tuesday, 24 February 2026, 5:30 PM

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026లో భాగంగా అహ్మ‌దాబాద్‌లో సౌతాఫ్రికాతో జ‌రిగిన సూప‌ర్ 8 మ్యాచ్‌లో భార‌త్ ఓడిపోవ‌డం మంచిదేన‌ని, త‌ప్పుల‌ను తెలుసుకుని ఇక‌పై అలా జ‌ర‌గ‌కుండా చూసే అవ‌కాశం ల‌భించింద‌ని భారత క్రికెట్ జ‌ట్టు మాజీ కోచ్‌, కామెంటేట‌ర్ ర‌విశాస్త్రి అన్నారు.

Nara Lokesh offering a cricket match ticket to YS Jagan Mohan Reddy.

జగన్ అడిగితే టికెట్ నేనే కొనిస్తా.. క్రికెట్ మ్యాచ్‌పై లోకేష్ సెటైర్లు!

Monday, 23 February 2026, 10:13 PM

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ ఫైన‌ల్‌కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తాన‌ని, కావాలంటే వైఎస్ జ‌గ‌న్‌కు కూడా ఓ టిక్కెట్‌ను తానే కొనుగోలు చేస్తాన‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ శాఖ మంత్రి, తెలుగు దేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ అన్నారు.

Sunil Gavaskar talking about India's loss to South Africa in T20 World Cup 2026.

బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్.. టీమిండియాపై గవాస్కర్ ఫైర్!

Monday, 23 February 2026, 3:49 PM

భార‌త క్రికెట్ జ‌ట్టు బ్యాట‌ర్ల‌కు ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంద‌ని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్‌ను ఎటు ప‌డితే అటు ఊప‌డం కాద‌ని క్రికెట్ దిగ్గ‌జం, కామెంటేట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ అన్నారు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నీలో భాగంగా ఆదివారం (ఫిబ్ర‌వ‌రి 22, 2026) అహ్మ‌దాబాద్‌లో సౌతాఫ్రికాతో జ‌రిగిన సూప‌ర్ 8 మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ఘోర ప‌రాజ‌యం పాల‌వ‌డంపై గ‌వాస్క‌ర్ స్పందించారు.

Suryakumar Yadav and Rohit Sharma T20I captaincy win rate comparison.

రోహిత్ రికార్డుకు సూర్య చెక్.. టీ20ఐల్లో నంబర్ 1 కెప్టెన్‌గా స్కై!

Sunday, 22 February 2026, 12:48 PM

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లోనే కాదు, అంత‌కు ముందు కూడా భార‌త జ‌ట్టును కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ విజ‌యాల బాట‌లో న‌డిపిస్తూ వ‌స్తున్నాడు. టోర్నీ ప్రారంభానికి ముందు స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన 5 టీ20ల సిరీస్‌లో సూర్య అనూహ్యంగా ఫామ్‌లోకి వ‌చ్చి దాన్ని ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ కొన‌సాగిస్తున్నాడు.

Abhishek Sharma talking about his performance in T20 World Cup 2026.

3 మ్యాచ్‌లు.. 3 డకౌట్లు: విమర్శలపై నోరు విప్పిన అభిషేక్ శర్మ!

Saturday, 21 February 2026, 7:35 PM

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026లో చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌పై టీమిండియా బ్యాట‌ర్, ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఎట్ట‌కేల‌కు స్సందించాడు. టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు మ్యాచ్‌ల్లో ఆడిన అభిషేక్ ఒక్క పరుగు కూడా ఖాతాలో న‌మోదు చేయ‌లేదు. యూఎస్ఏ, పాకిస్థాన్‌, నెద‌ర్లాండ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌ల‌లో వ‌రుస‌గా డ‌కౌట్ అయ్యాడు.

Ishan Kishan and Abhishek Sharma in ICC T20I batting rankings 2026.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ ఊచకోత.. నంబర్ 1గా అభిషేక్ శర్మ!

Thursday, 19 February 2026, 3:45 PM

తాజా ఐసీసీ టీ20 ఇంట‌ర్నేష‌న‌ల్‌ ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటారు. ఇటీవల ఫామ్‌పై ప్రశ్నలు వచ్చినప్పటికీ, భారత ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం.

Suryakumar Yadav talking to Team India players during India vs Pakistan T20 World Cup 2026 match.

పాక్ పై భారత్ ఘనవిజయం.. ప్లేయర్లకు సూర్యకుమార్ ఇచ్చిన సీక్రెట్ మంత్రం ఇదే!

Monday, 16 February 2026, 5:51 PM

కొలంబో వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ సమయంలో ఎన్నో ఉద్రిక్తతలు, వివాదాలు నెలకొన్నప్పటికీ.. మైదానంలో మాత్రం భారత జట్టు పూర్తిగా ప్రొఫెషనల్ దృక్పథంతో వ్యవహరించింది.

Bhanuka Rajapaksa clarifies comments on Indian cricketers' bats during T20 World Cup 2026.

టీ20 వరల్డ్ కప్ 2026: టీమిండియా బ్యాట్లలో రబ్బర్ ఉందా? రాజపక్స సంచలన వ్యాఖ్యలు.. అసలు నిజం ఇదే!

Wednesday, 11 February 2026, 3:05 PM

శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స భారత ఆటగాళ్లు ప్రత్యేక బ్యాట్లు ఉపయోగిస్తున్నారన్న తన వ్యాఖ్యలపై స్పష్ట‌త‌ ఇచ్చారు. టీ20 ప్రపంచకప్ 2026లో ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం సాధించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ మ్యాచ్ కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఫిబ్రవరి 8న జరిగింది.

Wankhede Stadium pitch and Team India captain visuals.

వాంఖడే పిచ్‌పై బీసీసీఐకి టీమిండియా ఫిర్యాదు..? అమెరికాతో మ్యాచ్ తర్వాత అసంతృప్తి..?

Tuesday, 10 February 2026, 8:04 PM

టీ20 వరల్డ్‌కప్ 2026లో ఈసారి అమెరికాతో త‌ల‌ప‌డ్డ భార‌త్ అతిక‌ష్టం మీద గెలిచింది. మ్యాచ్ ఆరంభానికి ముందు కొన్ని రోజుల వ‌ర‌కు పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంద‌ని, భార‌త్ 300 స్కోరు సాధించ‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ అంచ‌నా వేశారు.