t20 world cup 2026
టీమ్ ఇండియాకు గంభీర్ స్పెషల్ డిన్నర్.. నమీబియాతో పోరుకు ముందు అదిరిపోయే ప్లాన్!
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండియా తన తరువాతి మ్యాచ్‌లో నమీబియాతో తలపడనుంది. ఫిబ్రవరి 12వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2026: భారత్ ‘అత్యంత ప్రమాదకరమైన జట్టు’.. ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో స్పష్టమైన ఫేవరెట్‌గా నిలుస్తుందని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డారు.
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి అవుట్! స్కాట్లాండ్‌కు బంపర్ ఆఫర్..
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నీలోకి తీసుకుంటున్నట్లు ఐసీసీ అధికారికంగా బీసీబీకి తెలియజేసింది.
విశ్లేషణ: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంకృతాపరాధం.. పాక్ మాటలు నమ్మి వరల్డ్ కప్‌కు దూరం?
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు లేదా స్వార్థం కోసం పావులు కదుపుతారు. ఆ దిశగా బాధితులను పురిగొల్పుతారు. వస్తే కొండ, పోతే వెంట్రుక అన్నట్లు బాధితులను రెచ్చగొడతారు.
టీ20 వరల్డ్‌కప్ నుంచి తప్పింపుపై మొహమ్మద్ సిరాజ్ స్పందన
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తొలిసారి స్పందించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆడుతున్న సిరాజ్, ఆ మెగా టోర్నీలో పాల్గొనాలని తనకు ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగానే సెలెక్టర్లు ఆ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నానని చెప్పాడు.












