గురువారం, జూన్ 11, 2026
videos

Viral Video : త‌న‌ను వేధించిన వ్య‌క్తిని 20 సెక‌న్ల‌లో 40 సార్లు చెప్పుతో కొట్టిన మ‌హిళ‌.. వైర‌ల్ వీడియో..

Viral Video : నేటి సమాజంలో ఆడవారిపై అకృత్యాలు ఎక్కువైపోయాయి. కాలం మారుతుంది. అమ్మాయిలు కూడా ధైర్యం పెంచుకుని వాళ్లను  వేధించేవారిని శిక్షించడానికి ఏమాత్రం భయపడటం లేదు. తమదైన రీతిలో వాళ్లకు తగిన గుణపాఠం నేర్పిస్తున్నారు. ప్రస్తుతం సోషల్…

Viral Video : త‌న‌ను వేధించిన వ్య‌క్తిని 20 సెక‌న్ల‌లో 40 సార్లు చెప్పుతో కొట్టిన మ‌హిళ‌.. వైర‌ల్ వీడియో..

Viral Video : నేటి సమాజంలో ఆడవారిపై అకృత్యాలు ఎక్కువైపోయాయి. కాలం మారుతుంది. అమ్మాయిలు కూడా ధైర్యం పెంచుకుని వాళ్లను  వేధించేవారిని శిక్షించడానికి ఏమాత్రం భయపడటం లేదు. తమదైన రీతిలో వాళ్లకు తగిన గుణపాఠం నేర్పిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగంతో ఇలాంటి ప్రతి విషయం క్షణాల్లో వైరల్ అవుతుంది. ఒక వ్యక్తి తనను వేధించాడన్న ఆరోపణతో ఓ మహిళ చెప్పులతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లా ఒరాయ్ నగరంలోని ఒక ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఆమెను ఈవ్ టీజ్ చేసినట్లు సమాచారం. ట్విటర్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఒక మహిళ తన కోపాన్ని వ్యక్తం చేస్తూ తన రెండు చెప్పులతో నాన్‌స్టాప్‌గా వంగి కూర్చున్న ఒక వ్యక్తిని కొడుతోంది. ఈ వీడియో ప్రకారం ఆ మహిళ 20 సెకన్ల వ్యవధిలో అతడిని చెప్పుతో 40 సార్లు కొట్టింది. అనంతరం ఆ ప్రాంత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Viral Video woman beat a man with chappal what is the issue know
Viral Video

ట్విట్టర్ ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియోకు ఇప్ప‌టికే 50వేల‌కు పైగా వ్యూస్ రాగా 530 కంటే ఎక్కువ రీట్వీట్‌లను పొందింది. చాలా మంది నెటిజ‌న్లు ఆ ఈవ్ టీజర్‌కు బుద్ధి చెప్పినందుకు ఆ మహిళ ధైర్యాన్ని  అభినందించారు. మరికొందరు అతడికి ఇదే త‌గిన శిక్ష అని అన్నారు. ఆ అమ్మాయి ఆ వ్యక్తికి మంచి పాఠం నేర్పింది, ప్రతి అమ్మాయి అలాంటి ధైర్యం చూపించాలి, అప్పుడే అత్యాచారాలు, వేధింపుల సమస్యలు తొలగిపోతాయి.. అని కొంద‌రు కామెంట్స్ చేయ‌గా.. ఒక స్త్రీ చట్టాన్ని ఇలా తన చేతుల్లోకి తీసుకోకూడదు అంటూ మ‌రికొంద‌రు కామెంట్లు చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి