ఆదివారం, జూలై 26, 2026
వార్తలు

Viral Video : వార్నీ.. రూ.500 లంచం కోసం జుట్లు ప‌ట్టుకుని మ‌రీ త‌న్నుకున్న మ‌హిళా హెల్త్ కేర్ వ‌ర్క‌ర్లు..!

Viral Video : లంచం కోసం కొంద‌రు ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌రు. లంచం ఇస్తే ఏ ప‌నైనా చేస్తారు. అయితే అక్క‌డ జరిగింది వేరే. రోగులు ఇచ్చిన రూ.500 లంచం కోసం ఇద్ద‌రు సిబ్బంది సిగ‌లు ప‌ట్టుకుని మ‌రీ…

Viral Video : వార్నీ.. రూ.500 లంచం కోసం జుట్లు ప‌ట్టుకుని మ‌రీ త‌న్నుకున్న మ‌హిళా హెల్త్ కేర్ వ‌ర్క‌ర్లు..!

Viral Video : లంచం కోసం కొంద‌రు ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌రు. లంచం ఇస్తే ఏ ప‌నైనా చేస్తారు. అయితే అక్క‌డ జరిగింది వేరే. రోగులు ఇచ్చిన రూ.500 లంచం కోసం ఇద్ద‌రు సిబ్బంది సిగ‌లు ప‌ట్టుకుని మ‌రీ త‌న్నుకున్నారు. ఈ సంఘ‌ట‌న బీహార్‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

Viral Video two women health care workers fought for rs 500 bribe

బీహార్‌లోని ల‌క్ష్మీపూర్ బ్లాక్ ఏరియాలో ఉన్న జ‌ముయ్‌లో ఓ మ‌హిళ‌కు శిశువు జ‌న్మించింది. అయితే ఆ శిశువుకు బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అక్క‌డే ఉన్న ఆశ వ‌ర్క‌ర్ రింతు కుమారి ఆ శిశువును ఏఎన్ఎం వ‌ద్ద‌కు తీసుకెళ్లింది. ఈ క్ర‌మంలో ఆ శిశువుకు చెందిన వారు ఇచ్చిన రూ.500 లంచాన్ని పంచుకునేందుకు ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది.

ఆశ వ‌ర్క‌ర్ రింతు కుమారి, ఏఎన్ఎం ఇద్ద‌రూ రూ.500 లంచం కోసం గొడ‌వ‌ప‌డ్డారు. నాకంటే నాక‌ని ఇద్ద‌రూ గొడ‌వ‌ప‌డ‌గా.. అది ప‌తాక స్థాయికి చేరుకుంది. చివ‌ర‌కు ఇద్ద‌రూ ఒక‌రి జుట్టు ఒక‌రు ప‌ట్టుకుని త‌న్నుకున్నారు. ఆ త‌రువాత కొంద‌రు వారిని విడదీశారు. దీంతో గొడ‌వ స‌ద్దు మ‌ణిగింది. ఆ స‌మ‌యంలో తీసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

ఇక ఈ సంఘ‌ట‌నపై ఆ హాస్పిట‌ల్ ఉన్న‌తాధికారుల‌కు తెలిసింది. దీంతో అధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు. ఆ ఇద్ద‌రిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి