Viral Video : గుండె ధైర్యం ఉన్న‌వారే ఈ వీడియో చూడండి.. ఒక్క సెక‌న్ ఆల‌స్యం అయితే ప్రాణాలే పోయేవి..!

July 21, 2022 1:43 PM

Viral Video : రైలు ప‌ట్టాల‌పై దాటేట‌ప్పుడు అప్ర‌మత్తంగా ఉండాల‌ని.. లేదంటే అన‌వ‌స‌రంగా ప్రాణాల‌ను పోగొట్టుకోవాల్సి వ‌స్తుంద‌ని.. ఎన్ని హెచ్చ‌రిక‌లు చేస్తున్నా కొంద‌రు అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. నిర్ల‌క్ష్యంగానే ప్ర‌వ‌ర్తిస్తున్నారు. దీంతో చాలా మంది రైలు ప్ర‌మాదాల‌కు గుర‌వుతూ మృత్యువాత ప‌డుతున్నారు. రైలు వ‌స్తున్నా ప‌ట్టించుకోకుండా ప‌ట్టాలు దాటుతూ ఎంతో మంది ప్రాణాల‌ను పోగొట్టుకుంటున్నారు. అయితే అక్క‌డ కూడా ఇలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి చోటు చేసుకుంది. కానీ అదృష్ట‌వ‌శాత్తూ ఎవ‌రి ప్రాణాలూ పోలేదు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

ఆగి ఉన్న రైలు నుంచి కొంద‌రు దిగి ప‌ట్టాలు దాటి అవ‌త‌లి వైపుకు వెళ్తున్నారు. అయితే రైలు దిగి వేచి చూస్తున్న వృద్ధుల‌ను అవ‌త‌లి వైపుకు దాటించేందుకు కొంద‌రు మ‌ళ్లీ రైలు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. కానీ అంత‌లోపే ట్రెయిన్ రానే వ‌చ్చింది. దీంతో ప‌ట్టాలు దాటుదామ‌ని అనుకున్న‌వారు కూడా వెన‌క్కి వ‌చ్చేశారు. వారు రావ‌డం క‌నీసం ఒక్క సెక‌న్ ఆల‌స్యం అయినా స‌రే వారి ప్రాణాలు పోయి ఉండేవి. ఈ క్ర‌మంలోనే ఆ స‌మ‌యంలో తీసిన వీడియో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు పెడుతున్నారు.

Viral Video people cross train tracks accident just missed
Viral Video

రైలు ప‌ట్టాల‌పై చూసుకుని ప‌ట్టాలు దాటాల‌ని.. లేదంటే రైలు ప్ర‌మాదాల బారిన ప‌డ‌తార‌ని నెటిజ‌న్లు హెచ్చ‌రిస్తున్నారు. కొంద‌రు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ ప్రాణాల‌ను పోగొట్టుకుంటున్నార‌ని.. అయితే ఈ సంఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఏమీ కాలేదు. కానీ జ‌రిగి ఉంటే నిండు ప్రాణాలు పోయి ఉండేవని.. క‌నుక ఇప్ప‌టికైనా ప‌ట్టాల‌పై జాగ్ర‌త్తగా దాటాల‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now