Viral Video : గంజాయికి అల‌వాటు ప‌డ్డ కొడుక్కి క‌ళ్ల‌లో కారం పెట్టి కొట్టిన త‌ల్లి.. వీడియో..!

April 4, 2022 10:02 PM

Viral Video : ప్ర‌స్తుత త‌రుణంలో దేశంలో ఎక్క‌డ చూసినా యువ‌త‌.. ముఖ్యంగా విద్యార్థులు మ‌త్తు ప‌దార్థాల‌కు బానిస‌ల‌వుతున్నారు. ప్ర‌ధానంగా గంజాయి, డ్ర‌గ్స్ వంటి వాటిని ఎక్కువ‌గా తీసుకుంటూ జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్నారు. పోలీసులతోపాటు సంబంధిత శాఖ‌ల‌కు చెందిన అధికారులు, ప్ర‌భుత్వాలు డ్ర‌గ్స్ ప‌ట్ల ఎంత‌టి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నా.. వీటి స‌ర‌ఫ‌రా ఆగ‌డం లేదు. తాజాగా హైద‌రాబాద్‌లోని ఓ ప‌బ్‌లో భారీ ఎత్తున డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డడం.. ఇందులో ప‌లువురు ప్ర‌ముఖుల పిల్ల‌లు ఉండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే డ్ర‌గ్స్‌కు అల‌వాటు ప‌డుతున్న‌ త‌మ పిల్ల‌ల‌ను ఆ ప్ర‌ముఖులు ఎలా క‌ట్ట‌డి చేస్తున్నారో తెలియ‌దు కానీ.. ఓ సాధార‌ణ కుటుంబానికి చెందిన త‌ల్లి మాత్రం గంజాయికి అల‌వాటు ప‌డ్డ త‌న కుమారుడిని స‌రైన దారిలోకి తెచ్చేందుకు వినూత్న ప‌ద్ధ‌తిని అవ‌లంబించింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

Viral Video mother rubs chilli powder on son eyes for his actions
Viral Video

తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయికి అల‌వాటు ప‌డ్డ త‌న 15 ఏళ్ల కుమారుడికి ఓ త‌ల్లి చాలా క‌ఠిన‌మైన శిక్ష విధించింది. మ‌రో మ‌హిళ స‌హాయంతో త‌న కుమారున్ని ప‌ట్టుకుని చేతులు క‌ట్టిపెట్టి అత‌ని క‌ళ్ల‌పై కారం పూసింది. దీంతో ఆ బాధ‌కు త‌ట్టుకోలేక ఆ బాలుడు విల‌విలలాడిపోయాడు. నీళ్లు ఇవ్వ‌మ‌ని బ‌తిమాలుతూ తీవ్రంగా దుఃఖించాడు. అయితే అత‌ని బాధ‌ను ఆ త‌ల్లి ప‌ట్టించుకోలేదు. నీళ్లు ఇవ్వాలంటే గంజాయి మానేస్తాన‌ని చెప్పి ఒట్టు వేయాల‌ని ఆమె అడిగింది. దీంతో అందుకు ఒప్పుకున్న అత‌ను అలాగే చేస్తాన‌ని.. గంజాయిని ఇక‌పై ముట్టుకోన‌ని తెలిపాడు. ఈ క్ర‌మంలో అత‌నికి త‌న త‌ల్లి నీళ్లు ఇచ్చింది. కాగా ఆ స‌మ‌యంలో తీసిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది.

కాగా ఆ త‌ల్లి చేసిన ప‌నిని చాలా మంది మెచ్చుకుంటున్నారు. డ్ర‌గ్స్‌కు అల‌వాటు ప‌డుతున్న త‌మ పిల్ల‌ల‌ను ఇలా క‌ఠినంగా శిక్షిస్తేనే కానీ వారిలో మార్పు రాద‌ని.. ఆ త‌ల్లి ఇలా చేసినందుకు ఆమెకు హ్యాట్సాఫ్ అని అంటున్నారు. అయితే కొంద‌రు మాత్రం.. మ‌రీ ఇంత క‌ఠినంగా ప్ర‌వ‌ర్తించ‌వ‌ద్ద‌ని.. పిల్ల‌లు డ్ర‌గ్స్ లేదా గంజాయిని మానేసేలా ఇంకా వేరే ఏదైనా మార్గాన్ని అనుస‌రించాల‌ని.. సూచిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment