ఆదివారం, జూలై 26, 2026
వార్తలు

Viral Video : కుమారుడికి ప్ర‌భుత్వ ఉద్యోగం వ‌చ్చే స‌రికి.. ఆ త‌ల్లి ఎలా భావోద్వేగానికి గురైందో చూడండి..!

Viral Video : ప్ర‌స్తుతం పోటీ ప్ర‌పంచంలో ఉద్యోగాన్ని సంపాదించ‌డం ఎంత క‌ష్టంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. చిన్న ఉద్యోగం దొరికితే చాలు, ఉపాధి ల‌భిస్తుంది. దీంతో కుటుంబాన్ని పోషించుకోవ‌చ్చ‌ని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇక ప్ర‌భుత్వ ఉద్యోగం…

Viral Video : కుమారుడికి ప్ర‌భుత్వ ఉద్యోగం వ‌చ్చే స‌రికి.. ఆ త‌ల్లి ఎలా భావోద్వేగానికి గురైందో చూడండి..!

Viral Video : ప్ర‌స్తుతం పోటీ ప్ర‌పంచంలో ఉద్యోగాన్ని సంపాదించ‌డం ఎంత క‌ష్టంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. చిన్న ఉద్యోగం దొరికితే చాలు, ఉపాధి ల‌భిస్తుంది. దీంతో కుటుంబాన్ని పోషించుకోవ‌చ్చ‌ని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇక ప్ర‌భుత్వ ఉద్యోగం ల‌భించ‌డం చాలా క‌ష్టంగా మారింది. ప్ర‌భుత్వ ఉద్యోగం దొరికిందంటే చాలు, ఇక లైఫ్ లో సెటిల్ అయిన‌ట్లేన‌ని అంద‌రూ భావిస్తున్నారు. క‌నుక‌నే ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు డిమాండ్ ఏర్ప‌డుతోంది.

Viral Video mother gets emotional after her son got government job

ఇక త‌న కుమారుడికి ప్ర‌భుత్వ ఉద్యోగం రావ‌డంపై ఓ త‌ల్లి భావోద్వేగానికి గురైంది. అత‌ను సీజీడీఏ ఆడిట‌ర్‌గా ఎంపిక‌య్యాడ‌ని అందరూ అభినందించారు. దీంతో అత‌ని త‌ల్లి ఏడ్చేసింది. ఈ క్ర‌మంలో అత‌ను త‌న త‌ల్లిని ఓదార్చాడు. ఆన్‌లైన్ లో రిజ‌ల్ట్స్ చూసుకున్న అత‌ను ఆ ఉద్యోగానికి ఎంపిక‌య్యాన‌ని చెప్ప‌డంతో ఆ కుటుంబ స‌భ్యులు ప‌డిన సంతోషం అంతా ఇంతా కాదు. ఇక అత‌ని త‌ల్లి అయితే భావోద్వేగానికి గురైంది.

కాగా పైన చెప్పిన సంఘ‌ట‌న‌కు చెందిన వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా.. అది వైర‌ల్‌గా మారింది. అంద‌రూ ఆ త‌ల్లి ప్రేమ‌కు ఫిదా అవుతున్నారు. త‌న కుమారుడికి ప్ర‌భుత్వ ఉద్యోగం వ‌చ్చినందుకు ఆ త‌ల్లి ప‌డ్డ ఆనందాన్ని, కురిపించిన ఆనంద భాష్పాల‌ను చూసి.. చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. త‌ల్లి ప్రేమ అంటే అదేన‌ని.. కుమారుడికి ప్ర‌భుత్వ ఉద్యోగం దొర‌క‌డం క‌న్నా మించింది ఇక త‌ల్లిదండ్రుల‌కు ఏముంటుంది.. అని కామెంట్లు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ వీడియోకు ల‌క్ష‌ల కొద్దీ వ్యూస్ వ‌చ్చాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి