Viral Video : సీసా ఎత్తి బీర్ మొత్తం తాగిన మేక‌.. ఎద్దుతో ఢీ కొట్టిందిగా.. వైర‌ల్ వీడియో..!

July 22, 2022 2:41 PM

Viral Video : అస‌లే కోతి.. పైగా క‌ల్లు తాగింది.. ఆపై తల మీద తాటి పండు ప‌డింది.. ఇంకేముంది.. అన్న సామెత అంద‌రికీ తెలిసిందే. అయితే కోతులు ఆ విధంగా చేస్తాయి. కానీ సాధు జంతువులు అలా చేయ‌వు. అయిన‌ప్ప‌టికీ సాధు జంతువులు కూడా తేలిగ్గా తీసిపారేయ‌లేం. కొన్ని చాలా హుషారుగా కూడా ఉంటాయి. అవును.. ఇప్పుడు చెప్ప‌బోయేది అలాంటి ఒక జంతువు గురించే. అది ఒక మేక‌. అది చేసిన ప‌ని తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

ఒక మేక చిన్న‌పాటి బీర్ సీసాను ఎత్తి నోట్లో పెట్టుకుని మొత్తం బీర్ నంతా తాగేసింది. త‌రువాత ప‌క్క‌నే ఉన్న ఎద్దుతో సై అంటే సై అంటూ ఢీకొట్టేందుకు సిద్ధ‌మైంది. ఎద్దును త‌ల‌తో ఢీకొట్టింది కూడా. అయితే త‌రువాత ఏం జ‌రిగింది.. అన్న విష‌యం చాలా మందికి తెలియ‌దు. ఈ క్ర‌మంలోనే మేక ఇలా చేసిన వీడియో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. దీన్ని నెటిజ‌న్లు ఎంతో ఆస‌క్తిగా వీక్షిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video goat drink beer and fight with bull
Viral Video

మేక బీర్ తాగిందా.. న‌మ్మ‌లేకుండా ఉన్నాం.. అని కొంద‌రు కామెంట్లు పెట్ట‌గా.. తాగితే మేక‌లాంటి సాధు జంతువు కూడా ఎలా చూస్తుందో చూశారా.. అంటూ ఇంకొంద‌రు కామెంట్స్ పెడుతున్నారు. అలాగే.. అది తాగ‌బోతు మేక కాబోలు.. ఏకంగా ఎద్దుతోనే పోటీ పెట్టుకుంటోంది.. అని ఇంకొంద‌రు కామెంట్స్ చేశారు. దీంతో ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment