Viral Video : ఎద్దు ముందట రీల్ చేయ‌బోయింది.. అది చేసిన ప‌నికి బిత్త‌ర‌పోయింది.. వీడియో..!

June 7, 2022 9:06 AM

Viral Video : సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం చాలా మంది యాక్టివ్‌గా ఉంటున్నారు. అనేక సోష‌ల్ యాప్స్ అందుబాటులో ఉండ‌డంతో ప్ర‌తి దాంట్లోనూ నెటిజ‌న్లు గంట‌ల త‌ర‌బ‌డి కాల‌క్షేపం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వారు ఎక్కువ‌గా వీడియోల‌ను చూస్తున్నారు. ఫ‌న్నీ వీడియోల‌తోపాటు హీరోయిన్ల‌కు చెందిన గ్లామ‌ర్ వీడియోలు, ఇత‌రులు పోస్ట్ చేసే డ్యాన్స్ వీడియోల‌ను కూడా నెటిజ‌న్లు ఆద‌రిస్తున్నారు. క‌నుకనే చాలా మంది అందులో పాపుల‌ర్ అయ్యేందుకు భిన్న ర‌కాల వీడియోల‌ను క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లోనూ రీల్స్ బాగా పాపులర్ అయింది. ఇందులో ప‌లు పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేస్తూ అల‌రిస్తున్నారు.

అయితే గతంలో టిక్‌టాక్ యాప్ లో ఇలాగే వీడియోల‌ను చేసేవారు. కానీ ఆ యాప్‌ను నిషేధించాక అనేక యాప్స్ వ‌చ్చాయి. కానీ వాట‌న్నింటిలోనూ రీల్స్ యాప్‌కే ఆద‌ర‌ణ ఎక్కువ‌గా ఉంది. ఇక రీల్స్‌లో చాలా మంది వీడియోల‌ను అప్‌లోడ్ చేస్తున్నారు. అందులో అనేక మంది ల‌క్ష‌ల కొద్దీ ఫాలోవ‌ర్ల‌ను క‌లిగి ఉన్నారు. అయితే రీల్స్ చేసేట‌ప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ తేడా కొడితే మాత్రం ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర‌వుతాయి. ఓ యువ‌తికి కూడా స‌రిగ్గా ఇలాంటి ప‌రిస్థితే ఎదుర‌య్యేది. కానీ కొంచెంలో ప్ర‌మాదాన్ని త‌ప్పించుకుంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

Viral Video girl danced before bull what happened next
Viral Video

ఓ యువ‌తి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ను చేయ‌బోయింది. ఓ పాట‌కు డ్యాన్స్ చేస్తూ ఒక ఎద్దు ముందుకు వెళ్లింది. అయితే ఆ ఎద్దుకు ఆమె చేసేది న‌చ్చ‌లేదు కాబోలు.. వెంట‌నే ఆమెను పొడిచేందుకు ముందుకు వెళ్లింది. కానీ ఆ యువ‌తి అక్క‌డి నుంచి ప‌క్క‌కు త‌ప్పుకుని షాక్‌కు గురైంది. దీంతో ఆ వీడియోను నెటిజ‌న్లు ఎంతో ఆస‌క్తిగా వీక్షిస్తున్నారు. రీల్స్ చేయాలి.. కానీ ఇలాంటి జీవులతో క‌లిసి రీల్స్ చేసేట‌ప్పుడు కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని.. నెటిజ‌న్లు హిత‌వు ప‌లుకుతున్నారు. ఇక ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now