Viral News : పాపం.. ప్రియురాలి తల్లికి కిడ్నీ దానం చేశాడు.. ఆమె మాత్రం అత‌న్ని మోసం చేసి వేరే వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది..

January 20, 2022 3:45 PM

Viral News : ప్రేమ కోస‌మ‌ని కొంద‌రు ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. ప్రియుడు లేదా ప్రియురాలు త‌మ ల‌వ‌ర్ కోసం ఎన్నో క‌ష్టాలు ప‌డ‌తారు. వారికి ఎంతో స‌హాయం చేసి ఆదుకుంటారు. అయితే కొంద‌రు మాత్రం కేవ‌లం స్వార్థం కోస‌మే ప్రేమ‌ను ఉప‌యోగించుకుంటారు. చివ‌ర‌కు త‌మ అవ‌స‌రం తీరాక త‌మ ల‌వ‌ర్‌ను వ‌దిలించుకుంటారు. ఇలాంటి వాళ్ల‌ను మ‌నం నిత్య జీవితంలో చూస్తుంటాం. సినిమాల్లోనూ చూపిస్తుంటారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘ‌ట‌న మెక్సికోలో చోటు చేసుకుంది.

Viral News  man donated kidney to lovers mother she ditched him

మెక్సికోకు చెందిన ఉజియెల్ మార్టినెజ్ స్థానికంగా ఓ పాఠ‌శాల‌లో ఉపాధ్యాయుడిగా ప‌నిచేస్తున్నాడు. అత‌ను ఓ మ‌హిళ‌ను ప్రేమిస్తున్నాడు. అయితే ఆమె త‌ల్లికి అనారోగ్యం కార‌ణంగా కిడ్నీ చెడిపోవ‌డంతో మార్పిడి చేయాల్సి వ‌చ్చింది. దీంతో మార్టినెజ్ త‌న కిడ్నీని దానం చేసేందుకు ముందుకు వ‌చ్చాడు.

వైద్యులు ప‌రీక్ష‌లు చేసి చూడ‌గా.. కిడ్నీ స‌రిపోయింది. దీంతో మార్టినెజ్ అనుమతి మేర‌కు అత‌ని ఒక కిడ్నీని త‌న ప్రియురాలి త‌ల్లికి అమ‌ర్చారు. అయితే నెల రోజుల పాటు అంతా బాగానే ఉంది. కానీ స‌డెన్‌గా మార్టినెజ్ ప్రియురాలు అత‌న్ని మోసం చేసింది. అత‌న్ని విడిచిపెట్టింది. వేరే వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది. ఈ విష‌యాన్ని మార్టినెజ్ టిక్‌టాక్ వీడియో ద్వారా తెలియ‌జేశాడు. దీంతో ఆ వీడియో వైర‌ల్‌గా మారింది. కొన్ని కోట్ల మంది ఆ వీడియోను వీక్షించారు. అంద‌రూ మార్టినెజ్‌కు సానుభూతి తెలుపుతున్నారు.

ప్ర‌స్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నాన‌ని, కోలుకుంటున్నాన‌ని.. త‌న గ‌ర్ల్ ఫ్రెండ్‌పై త‌న‌కు ఎలాంటి కోపం లేద‌ని, ఆమె సంతోషంగా ఉంటే చాల‌ని.. అంటున్నాడు. అలాంటి మంచి వ్య‌క్తిని దూరం చేసుకుంద‌ని అత‌ని ప్రియురాలిని నెటిజ‌న్లు తీవ్రంగా దూషిస్తున్నారు. ఆమెపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా.. ఇలాంటి ప‌రిస్థితి ఏ ల‌వ‌ర్‌కూ రాకూడ‌దు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now