బుధవారం, జూలై 1, 2026
క్రీడ‌లు

Under 19 Cricket World Cup 2022 : వామ్మో.. అది మామూలు సిక్స్ కాదు.. ఆ షాట్‌కు పేరు పెట్ట‌గ‌ల‌మా..?

Under 19 Cricket World Cup 2022 : అండ‌ర్ 19 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా భార‌త్ ఇప్ప‌టికే ఆస్ట్రేలియాపై సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఘ‌న విజ‌యం సాధించి ఫైన‌ల్స్‌లో అడుగు పెట్టిన విష‌యం విదిత‌మే. ఈ…

Under 19 Cricket World Cup 2022 : వామ్మో.. అది మామూలు సిక్స్ కాదు.. ఆ షాట్‌కు పేరు పెట్ట‌గ‌ల‌మా..?

Under 19 Cricket World Cup 2022 : అండ‌ర్ 19 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా భార‌త్ ఇప్ప‌టికే ఆస్ట్రేలియాపై సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఘ‌న విజ‌యం సాధించి ఫైన‌ల్స్‌లో అడుగు పెట్టిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఆ జ‌ట్టును భార‌త్ చిత్తు చిత్తు చేసింది. భారీ ప‌రుగుల తేడాతో భార‌త్ విజ‌యం సాధించింది. ఇక భార‌త్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ య‌శ్ ధుల్ వీరోచిత‌మైన సెంచ‌రీ ఉంది.

Under 19 Cricket World Cup 2022 yash dhull sixer viral video
Under 19 Cricket World Cup 2022

భార‌త్ ఇన్నింగ్స్‌లో భాగంగా కెప్టెన్ య‌శ్ ధుల్ 10 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో ఆక‌ట్టుకున్నాడు. మొత్తం 110 ప‌రుగులు చేశాడు. అయితే త‌న ఇన్నింగ్స్‌లో య‌శ్ ధుల్ కొట్టిన సిక్స్ తాలూకు వీడియో వైర‌ల్‌గా మారింది. క్రికెట్ పుస్త‌కాల్లో అస‌లు అత‌ను ఆడిన షాట్‌కు పేరే లేదు. దీనికి ఎలాంటి పేరు పెట్టాలో చెప్పాల‌ని సాక్షాత్తూ ఐసీసీ ట్వీట్ చేసింది. ఈ క్ర‌మంలోనే య‌శ్ ధుల్ ఆడిన షాట్ వీడియో వైర‌ల్ అవుతోంది.

కాగా భార‌త్, ఇంగ్లండ్ ల మ‌ధ్య ఐసీసీ అండ‌ర్ 19 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2022 ఫైన‌ల్ మ్యాచ్ ఈ నెల 5వ తేదీన జ‌ర‌గ‌నుంది. భార‌త కాల‌మానం ప్రకారం సాయంత్రం 6.30 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. దీని కోసం యావ‌త్ భార‌త క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి