Uday Kiran : ఉద‌య్ కిర‌ణ్‌ని చిరంజీవి అల్లున్ని చేసుకోవాల‌నుకుంది.. ఆ ఒక్క కార‌ణంతోనే..?

July 12, 2022 10:33 PM

Uday Kiran : చాలా త‌క్కువ స‌మయంలోనే సినిమా ఇండ‌స్ట్రీలో పాపుల‌ర్ అయిన హీరోల‌లో ఉద‌య్ కిర‌ణ్ ఒక‌రు. ఈయ‌న తొలిసారిగా న‌టించిన మూవీ.. చిత్రం. ఉషా కిర‌ణ్ మూవీస్ వారు ఈ సినిమాను నిర్మించారు. త‌రువాత తేజ‌తో నువ్వు నేను చేశాడు. అది హిట్ అయింది. అలాగే మ‌న‌సంతా నువ్వే కూడా హిట్ అయింది. దీంతో ఉద‌య్ కిర‌ణ్ ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయ్యాడు. ఆయ‌న‌కు ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. అప్ప‌ట్లోనే ఉద‌య్ అగ్ర హీరోల‌కు దీటుగా ఎద‌గ‌డం ప్రారంభించాడు. ఈ క్ర‌మంలోనే ఓ ద‌శ‌లో ఇత‌ర హీరోల సినిమాల‌కు ఇబ్బందులు త‌లెత్తాయ‌నే చెప్ప‌వ‌చ్చు.

అలా ఉదయ్ కిర‌ణ్ తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో అంచ‌లంచెలుగా ఎదిగాడు. ఈ క్రమంలోనే ఉద‌య్ క్రేజ్‌ను చూసిన చిరంజీవి త‌న పెద్ద కుమార్తె సుస్మిత‌ను ఆయ‌న‌కు ఇచ్చి పెళ్లి చేయాల‌ని అనుకున్నారు. ఉద‌య్‌కు ఎంతో భ‌విష్య‌త్తు ఉంద‌ని.. స్టార్ హీరో అయ్యే చాన్స్‌లు ఉన్నాయ‌ని చిరంజీవి అనుకున్నారు. క‌నుక‌నే త‌న‌ను అల్లున్ని చేసుకోవాల‌ని అనుకున్నారు. దీంతో ఉద‌య్ కిర‌ణ్ కు ఆఫ‌ర్లు కూడా బాగానే వ‌చ్చాయి. ఇక ఉద‌య్, సుస్మిత‌ల ఎంగేజ్‌మెంట్ బాధ్య‌త‌ను చిరంజీవి అల్లు అర‌వింద్ చేతిలో పెట్టారు.

this is the reason why Chiranjeevi wanted Uday Kiran as son in law
Uday Kiran

అయితే ఉన్న‌ట్లుండి ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ.. ఎంగేజ్‌మెంట్‌ను ర‌ద్దు చేశారు. అస‌లు ఆ ఎంగేజ్‌మెంట్‌ను ఎందుకు ర‌ద్దు చేసుకున్నారో ఇప్ప‌టి వ‌ర‌కు తెలియ‌దు. కానీ చిరంజీవి మాత్రం ఉద‌య్‌ని త‌న అల్లున్ని చేసుకునేందుకు ఆరాట‌పడ్డారు. త‌రువాత ఉద‌య్‌కి ఆఫ‌ర్లు రావ‌డం త‌గ్గాయి. దీంతో ఆయ‌న ఇంకో యువ‌తిని పెళ్లి చేసుకున్నారు. త‌రువాత అయినా స‌రే ఆఫ‌ర్లు వ‌స్తాయేమోన‌ని ఆశ ప‌డ్డాడు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. దీంతో తీవ్ర మ‌న‌స్థాపం చెందిన ఉద‌య్ కిర‌ణ్ సూసైడ్ నోట్ రాసి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

అయితే ఉద‌య్ ఆత్మ‌హ‌త్య‌కు మెగా కుటుంబమే కార‌ణ‌మని వార్త‌లు వ‌చ్చాయి. కానీ విష‌యం అది కాద‌ని స‌మాచారం. ఉద‌యే స్వ‌యంగా ఎంగేజ్‌మెంట్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరిన‌ట్లు కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ వార్త‌ల్లో నిజం ఎంత ఉంది.. అన్న విష‌యం తెలియ‌దు కానీ.. అల్లున్ని చేసుకోవాల‌ని ఆరాట‌ప‌డిన చిరంజీవి ఎంగేజ్‌మెంట్‌ను ఎందుకు ర‌ద్దు చేశారు.. అన్న‌దే ఇప్ప‌టి వ‌ర‌కు సందేహంగా మారింది. మ‌రి ఈ విష‌యంలో నిజం ఎప్ప‌టికి తెలుస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now