గురువారం, జూన్ 11, 2026
క్రైమ్‌

ఈ దొంగ రూటే సపరేటు… దొంగతనం చేస్తే ఎవ్వరికీ అనుమానం రాదు.. కానీ!

సాధారణంగా దొంగతనం చేసే వారు రాత్రిపూట జన సంచారం లేని ప్రదేశాలలో దొంగతనాలు చేస్తుంటారు. ఈ విధంగా రాత్రిపూట దొంగతనాలు చేసిన ఎంతోమంది దొంగలను పోలీసులు గుర్తించారు. కానీ ఈ దొంగ మాత్రం పట్టపగలు దొంగతనాలు చేస్తూ పోలీసులకు…

ఈ దొంగ రూటే సపరేటు… దొంగతనం చేస్తే ఎవ్వరికీ అనుమానం రాదు.. కానీ!

సాధారణంగా దొంగతనం చేసే వారు రాత్రిపూట జన సంచారం లేని ప్రదేశాలలో దొంగతనాలు చేస్తుంటారు. ఈ విధంగా రాత్రిపూట దొంగతనాలు చేసిన ఎంతోమంది దొంగలను పోలీసులు గుర్తించారు. కానీ ఈ దొంగ మాత్రం పట్టపగలు దొంగతనాలు చేస్తూ పోలీసులకు దొరకకుండా ఉండడమే ఇతని ప్రత్యేకత. అందరూ దొంగలు రాత్రిపూట దొంగతనం చేస్తే ఇతను మాత్రం పట్టపగలు దొంగతనాలు చేస్తుంటాడు.గత ఏడు సంవత్సరాలుగా ఆంధ్ర, తమిళనాడు పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఈ దొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన కథనం మేరకు…

తమిళనాడు రాష్ట్రం తిరప్పత్తూరు జిల్లా కరంభూరు గ్రామానికి చెందిన గోవిందరాజన్‌ కుమారుడు శక్తివేల్‌(33) అక్కడ టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఎవ్వరికీ ఏమాత్రం అనుమానం రాకుండా దొంగతనాలు చేయటం ఇతని ప్రత్యేకత. ఎక్కువ జనాభా లేని గ్రామాలను ఎంపిక చేసుకొని ఉదయం అందరూ పొలం పనులకు వెళ్లగానే ఇతను కారులో వెళ్లి ఆ ఇంటి తలుపు పై లేదా చుట్టుపక్కల తాళాన్ని వెతికి సులభంగా ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న బంగారు నగలను దొంగతనం చేస్తుంటాడు.

ఏడు సంవత్సరాల నుంచి దొంగతనం చేస్తున్న ఇతని పై ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలలో కేవలం 15 కేసులు మాత్రమే నమోదయ్యాయి.పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు ఈ దొంగ దాదాపు 250 గ్రాముల బంగారాన్ని దొంగిలించినట్లు తెలిపారు. ఈ విధంగా ఉదయం పూట మాత్రమే జరుగుతున్న దొంగతనాలు పై నిఘా పెట్టిన ఐడీ పార్టీ ఈ చోరీలకు పాల్పడుతున్నది శక్తివేల్‌గా గుర్తించి, చివరికి బైరెడ్డిపల్లి వద్ద అతనిని అదుపులోకి తీసుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి