Reject Zomato : ఫుడ్ డెలివ‌రీ యాప్ జొమాటోకు షాక్‌.. పెద్ద ఎత్తున డిలీట్ చేస్తున్న యూజ‌ర్లు.. ఎందుకో తెలుసా ?

October 19, 2021 10:17 AM

Reject Zomato : ప్ర‌ముఖ ఫుడ్ డెలివ‌రీ యాప్ జొమాటోకు షాక్ త‌గిలింది. ఓ క‌స్ట‌మ‌ర్ తో జొమాటో ప్ర‌తినిధి చాట్ చేసిన తీరుకు నిర‌స‌న‌గా యూజ‌ర్లు పెద్ద ఎత్తున ఆ యాప్‌ను డిలీట్ చేస్తున్నారు. జొమాటో స్వ‌యంగా రంగంలోకి దిగి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నం చేసింది. అయిన‌ప్ప‌టికీ యూజర్ల నిర‌స‌న మాత్రం ఆగ‌డం లేదు. వివ‌రాల్లోకి వెళితే..

Reject Zomato hashtag trending in twitter know the reason

త‌మిళ‌నాడుకు చెందిన వికాష్ అనే వ్య‌క్తి సోమ‌వారం సాయంత్రం కొన్ని ర‌కాల ఫుడ్ ఐట‌మ్స్‌ను జొమాటోలో ఆర్డ‌ర్ చేశాడు. అయితే కొన్ని అందులో మిస్ అయ్యాయి. దీంతో జొమాటో క‌స్ట‌మ‌ర్ కేర్‌తో చాట్ చేశాడు. అయితే తాము ఎన్నిసార్లు ఆ రెస్టారెంట్ కు ఫోన్ చేసినా స‌ద‌రు రెస్టారెంట్ సిబ్బంది స‌రిగ్గా స్పందించ‌డం లేద‌ని.. వారికి భాష స‌మ‌స్య‌గా మారింద‌ని జొమాటో ప్ర‌తినిధి పేర్కొన్నాడు.

అయితే అది త‌న స‌మ‌స్య కాద‌ని, మిస్ అయిన ఫుడ్ ఐటమ్స్‌కు బ‌దులుగా డ‌బ్బును రీఫండ్ చేయాల‌ని కోరాడు. అయితే త‌మ వ‌ల్ల కావ‌డం లేద‌ని, క‌నుక డ‌బ్బును రీఫండ్ చేయ‌డం కుద‌ర‌ద‌ని స‌ద‌రు ఎగ్జిక్యూటివ్ చెప్పాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన వికాష్.. త‌మిళ‌నాడులో వ్యాపారం చేస్తూ త‌మిళం తెలియ‌క‌పోతే ఎలా..? ఇక్క‌డి ప్రాంతానికి చెందిన వారిని పెట్టుకోవ‌చ్చు క‌దా ? అని ప్ర‌శ్నించాడు.

ఇందుకు జొమాటో ప్ర‌తినిధి బ‌దులిస్తూ.. మీరు హిందీ నేర్చుకోవ‌చ్చు క‌దా.. అది జాతీయ భాష‌. కొంచెమైనా హిందీ నేర్చుకుంటే బాగుంటుంది.. అని అన్నాడు. దీంతో వికాష్‌కు ఇంకా మండింది. త‌న‌కు ఎదురైన స‌మ‌స్య గురించి ట్విట్ట‌ర్ లో పోస్ట్ పెట్టాడు. అంతేకాదు.. తాను జొమాటో ప్ర‌తినిధితో చేసిన చాట్ తాలూకు స్క్రీన్ షాట్ల‌ను కూడా పెట్టాడు. దీంతో త‌మిళ పౌరులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

https://twitter.com/KarthikSubbur11/status/1450280818732011523

త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క పౌరుల‌కు స‌హ‌జంగానే త‌మ మాతృభాష అంటే అభిమానం చాలా ఎక్కువ‌. దీంతో ఆ పోస్టుల‌ను చూసిన త‌మిళుల‌కు ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. వెంట‌నే జొమాటోను డిలీట్ చేయ‌డం మొద‌లు పెట్టారు. అలా జొమాటోపై వారు నిర‌స‌న మొద‌లు పెట్టారు. దీంతో ట్విట్ట‌ర్‌లో పెద్ద ఎత్తున #Reject_Zomato అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

చాలా మంది త‌మిళులు ఈ విష‌యం తెలిసి ఈ నిర‌స‌న‌లో పాల్గొంటున్నారు. జొమాటో క‌చ్చితంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందేన‌ని, త‌మ కంపెనీని త‌మిళ‌నాడు ఆప‌రేట్ చేస్తే.. త‌మిళుల‌ను ఎందుకు నియ‌మించుకోరు ? అని ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో జొమాటో స్వ‌యంగా వికాష్‌కు సారీ చెప్పింది. స‌మ‌స్య‌ను ప‌రిష్కరిస్తామ‌ని తెలిపింది. అయిన‌ప్ప‌టికీ త‌మిళులు జొమాటోను అన్ ఇన్‌స్టాల్ చేస్తూనే ఉన్నారు.

https://twitter.com/ArjunanDurai/status/1450285178266349579

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now