Tapsee : ఆ విధంగా చెబితే నాకు థ్రిల్‌గా అనిపిస్తుంది.. తాప్సీ ఆసక్తిక‌ర‌మైన‌ వ్యాఖ్య‌లు..!

February 2, 2022 8:49 AM

Tapsee : సీనియ‌ర్ హీరోయిన్ తాప్సీ ఈ మ‌ధ్య కాలంలో చాలా వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తోంది. ఈమె బాలీవుడ్‌లో స్థిర‌ప‌డిపోయింది. అక్క‌డ ఈమెకు అవ‌కాశాలు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ఎక్కువ‌గా మ‌హిళా ప్రాధాన్య‌త ఉన్న సినిమాల్లో తాప్సీ న‌టిస్తోంది. అయితే ఈ అంశానికి సంబంధించి తాజాగా ఆమె మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డంచింది.

Tapsee says she likes it when some body says that
Tapsee

ప్ర‌స్తుతం తాను మ‌హిళా ప్రాధాన్య‌త ఉన్న క‌థ‌ల‌నే ఎంపిక చేసుకుంటున్నాన‌ని.. అలాంటి సినిమాల్లోనే న‌టిస్తున్నాన‌ని.. తాప్సీ తెలియ‌జేసింది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేయ‌బోన‌ని తెలిపింది. కొంద‌రు త‌న వ‌ద్ద‌కు ఫీమేల్ లీడ్ క‌థ‌తో వ‌చ్చి ఈ క‌థ మీ కోస‌మే రాశాన‌ని చెబుతున్నార‌ని.. అలా వారు చెప్పిన‌ప్పుడు త‌న‌కు థ్రిల్‌గా అనిపిస్తుంద‌ని తాప్సీ కామెంట్ చేసింది.

కాగా తాప్సీ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు, సిరీస్‌ల‌తో బిజీగా ఉంది. బాలీవుడ్‌లో ఈమెకు సొంత ప్రొడ‌క్ష‌న్ హౌస్ కూడా ఉంది. అందులో భాగంగానే త్వ‌ర‌లో ఈమె స‌మంతతో క‌లిసి ఓ ఫీమేల్ సెంట్రిక్ సినిమాను తీయ‌నుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. మ‌రి స‌మంత అందులో న‌టిస్తుందా.. లేదా చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment