Taapsee Mission Impossible Movie Review : సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ మిషన్ ఇంపాజిబుల్.. మూవీ రివ్యూ..!

April 1, 2022 2:49 PM

Taapsee Mission Impossible Movie Review : హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ మిషన్ ఇంపాజిబుల్. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ డైరెక్టర్ స్వరూజ్ ఆర్ఎస్‌జే డైరెక్ట్ చేసిన ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ..

కథలోకి ఎంటర్ అయితే ఈ సినిమా అంతా తిరుపతికి దగ్గర్లోని ఓ చిన్న గ్రామంలో ఉంటుంది. అక్కడ అల్లరిగా తిరుగుతూ ఉండే ఓ ముగ్గురు పిల్లలు లైఫ్ లో సింపుల్ గా పెద్ద స్థాయికి చేరుకోవాలనుకుంటారు. అలా గ్యాంగ్ స్టర్ దావుద్ ఇబ్రహీంను పట్టుకుంటే భారీ రివార్డ్ ను అందిస్తారని ముందు వెనుక ఆలోచించకుండా వెళ్తారు. మరి వాళ్ల ప్రయత్నం ఫలించిందా.. మరో పక్క ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్ర ఏమిటి ? అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

Taapsee Mission Impossible Movie Review
Taapsee Mission Impossible Movie Review

ప్లస్ పాయింట్స్ : ఈ సినిమాలో స్కీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముగ్గురు చిన్నపిల్లలు తెలియకుండానే రిస్క్ లో పడటం, తాప్సీ యాక్టింగ్ ఆకట్టుకునేలా ఉంది. ముగ్గురు పిల్లల కాన్ఫిడెన్స్ వీక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ క్రమంలో ఫన్ కూడా రావడం విశేషం. ఇంకా తాప్సీ, ఆ ముగ్గురు పిల్లల ఎమోషన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

మైనస్ పాయింట్స్ : ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా దర్శకుడు అనగానే ప్రేక్షకుల్లో తెలియకుండానే ఇంటెన్స్ క్రియేట్ అయ్యింది. ఆయన డైరెక్ట్ చేసిన మూవీలో లాజిక్ లోనూ, థ్రిల్ లోనూ కీలకమైన జాగ్రత్తలు తీసుకున్న డైరెక్టర్, ఈ సినిమాలో అవి మిస్ చేయడం కాస్త నిరాశపరిచింది. నరేషన్ కూడా సిల్లీగా అనిపిస్తుంది. తాప్సీ రోల్ ను ఇంకాస్త స్ట్రాంగ్ గా చూపించాల్సింది. పిల్లల పాత్రలకు సంబంధించి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇంకాస్త బెటర్ గా తీర్చిదిద్దితే బాగుండేది.

టెక్నికల్ టీమ్ : మిషన్ ఇంపాజిబుల్ మూవీలో టెక్నికల్ టీమ్ సపోర్ట్ అద్భుతంగా వర్కవుట్ అయ్యింది. మ్యూజిక్ డైరెక్టర్ గా మార్క్ కె రాబిన్ స్కోర్ ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ మూవీకి నేచురల్ ఫీలింగ్ ను అందించింది. స్వరూప్ టేకింగ్ విషయంలో కాస్త తడబడ్డాడనే చెప్పాలి. తాను సెలెక్ట్ చేసుకున్న పాయింట్ బాగుంది గానీ లాజిక్స్ తో అంత మంచి సినిమా తీసినా తన నుండి ఇలాంటి కీలకమైన పాయింట్స్ మిస్ అవ్వడం గమనార్హం.

తీర్పు : ఫైనల్ గా ఈ సినిమా కామెడీ, థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవరాల్ గా చూసుకుంటే సింపుల్ అండ్ డీసెంట్ మూవీ మిషాన్ ఇంపాజిబుల్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now