శనివారం, జూలై 25, 2026
క్రీడ‌లు

T20 World Cup 2021 : చిత్తుగా ఓడిన స్కాట్లండ్‌.. ఆఫ్గ‌నిస్థాన్ అద్బుత‌మైన విజ‌యం..

T20 World Cup 2021 : షార్జా వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 17వ మ్యాచ్‌లో స్కాట్లండ్‌పై ఆఫ్గ‌నిస్థాన్ ఘ‌న విజ‌యం సాధించింది. ఆఫ్గ‌న్ ముందు ప‌సికూన స్కాట్లండ్ తేలిపోయింది. ఆఫ్గ‌నిస్థాన్ ఉంచిన భారీ ల‌క్ష్యాన్ని…

T20 World Cup 2021 : చిత్తుగా ఓడిన స్కాట్లండ్‌.. ఆఫ్గ‌నిస్థాన్ అద్బుత‌మైన విజ‌యం..

T20 World Cup 2021 : షార్జా వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 17వ మ్యాచ్‌లో స్కాట్లండ్‌పై ఆఫ్గ‌నిస్థాన్ ఘ‌న విజ‌యం సాధించింది. ఆఫ్గ‌న్ ముందు ప‌సికూన స్కాట్లండ్ తేలిపోయింది. ఆఫ్గ‌నిస్థాన్ ఉంచిన భారీ ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేక స్కాట్లండ్ కుప్ప‌కూలింది. దీంతో స్కాట్లండ్‌పై ఆఫ్గ‌నిస్థాన్ 130 పరుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

T20 World Cup 2021 afghanisthan won by 130 runs against scotland in 17th match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్గ‌నిస్థాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 190 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. ఆఫ్గ‌న్ బ్యాట్స్‌మెన్ల‌లో టాప్ 4 బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణించారు. 34 బంతులు ఆడిన న‌జీబుల్లా జ‌ద్రాన్ 5 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 59 ప‌రుగులు చేయ‌గా.. ర‌హ‌మానుల్లా గుర్బాజ్ 37 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్ల‌తో 46 ప‌రుగులు చేశాడు. మ‌రో బ్యాట్స్‌మ‌న్ హ‌జ్ర‌తుల్లా జ‌జై 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 44 ప‌రుగులు చేశాడు. స్కాట్లండ్ బౌల‌ర్లలో స‌ఫ్‌యాన్ ష‌రీఫ్ 2 వికెట్లు తీయ‌గా, జోష్ డేవీ, మార్క్ వాట్ చెరొక వికెట్ తీశారు.

అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన స్కాట్లండ్ 10.2 ఓవ‌ర్ల‌లోనే కుప్ప‌కూలింది. 60 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్‌ల‌లో ఎవ‌రూ ఆక‌ట్టుకోలేదు. ఓపెన‌ర్ జార్జ్ మున్సే ఒక్క‌డే 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 25 ప‌రుగులు చేసి ఫ‌ర్వాలేద‌నిపించాడు. ఇక ఆఫ్గ‌న్ బౌల‌ర్ల‌లో ముజీబ్ ఉర్ ర‌హ‌మాన్ ఏకంగా 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ర‌షీద్ ఖాన్ కూడా 4 వికెట్లు తీసి స్కాట్లండ్ ప‌త‌నాన్ని శాసించాడు. మ‌రో బౌల‌ర్ న‌వీన్ ఉల్ హ‌క్ కు 1 వికెట్ ద‌క్కింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి