బుధవారం, జూన్ 24, 2026
వార్తలు

Sri Reddy : పెళ్లి అయ్యిందా ? అని అడిగిన నెటిజన్‌.. శ్రీరెడ్డి షాకింగ్‌ సమాధానం..!

Sri Reddy : సంచలన తార, వివాదాస్పద నటి శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా శ్రీరెడ్డి చేసే వ్యాఖ్యలు సంచలనం సృష్టి స్తుంటాయి. ఇక మీ టూ, క్యాస్టింగ్ కౌచ్…

Sri Reddy : పెళ్లి అయ్యిందా ? అని అడిగిన నెటిజన్‌.. శ్రీరెడ్డి షాకింగ్‌ సమాధానం..!

Sri Reddy : సంచలన తార, వివాదాస్పద నటి శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా శ్రీరెడ్డి చేసే వ్యాఖ్యలు సంచలనం సృష్టి స్తుంటాయి. ఇక మీ టూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా ఎంతో మంది బడా బాబుల బాగోతం బయటపెట్టిన శ్రీ రెడ్డి ప్రస్తుతం చెన్నైలో నివసిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా పలు రాజకీయ అంశాలు, సామాజిక అంశాలపై స్పందిస్తూ తన దైన శైలిలో కామెంట్లు చేసే ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది.

Sri Reddy shocking answer to netizen who asked about her marriage

ఈ సందర్భంగా అభిమానులతో చిట్ చాట్ చేసిన శ్రీ రెడ్డికి ఓ నెటిజన్ ఎంతో ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. సదరు నెటిజన్.. ఇంతకూ మీకు పెళ్లి అయ్యిందా ? అనే డౌట్ అడగడంతో అందుకు శ్రీరెడ్డి సమాధానం చెబుతూ.. తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత కాలంలో ఒక అబ్బాయి, అమ్మాయి ఎక్కువ రోజులు వారి రిలేషన్ లో ఉండటం లేదు. కొన్ని మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంటున్నారు.

ఒకవేళ తన జీవితంలో తనకు తోడుగా జీవిత కాలం ఉండబోయే మగాడు దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని ఈ సందర్భంగా ఈమె తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. అదే విధంగా ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళలో కూడా అంత పతివ్రతలు ఎవరూ లేరంటూ అమ్మాయిల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. తన ఒంటిపై 5 టాటూలు ఉన్నాయని, అప్పుడప్పుడు మందు తాగుతా.. అనే విషయాలను కూడా ఈ సందర్భంగా శ్రీ రెడ్డి అభిమానులకు తెలియజేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి