Sri Reddy : నాన్‌వెజ్ వంట‌కాల‌ను తెగ తినేస్తున్న శ్రీ‌రెడ్డి.. వీడియో..!

June 24, 2022 8:54 PM

Sri Reddy : సోష‌ల్ మీడియాలో శ్రీ‌రెడ్డి ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ మ‌ధ్య ఈమె సామాజిక అంశాల‌పై పెద్ద‌గా స్పందించ‌డం లేదు. త‌న ప‌నేదో తాను చేసుకుపోతోంది. చివ‌రిసారిగా ఈమె నాగ‌బాబు కుమార్తె నిహారిక డ్ర‌గ్స్ కేసు విష‌య‌మై తెర మీద‌కు వ‌చ్చింది. ఆ త‌రువాత మళ్లీ ఏ ఇష్యూపై కూడా స్పందించ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో మాత్రం హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉంది. త‌న సొంత ప‌నుల‌తో బిజీగా మారింది. ఇక ఈమె ప్ర‌స్తుతం చెన్నైలో ఉంటూ.. అక్క‌డి నుంచే త‌న కార్య‌క‌లాపాల‌ను చ‌క్కబెడుతోంది. ఈ క్ర‌మంలోనే త‌న యూట్యూబ్ చానల్‌లో వంటల వీడియోల‌ను పోస్ట్ చేస్తూ ఎంతో బిజీగా మారింది.

శ్రీ‌రెడ్డి ఈ మ‌ధ్య కాలంలో యూట్యూబ్ చానల్‌లో వంట‌ల వీడియోల‌ను ఎక్కువ‌గా పోస్ట్ చేస్తూ వ‌స్తోంది. అయితే ఇప్పుడు వంట‌లు మాని రెస్టారెంట్‌ల‌కు తిరుగుతూ అక్క‌డ ఉండే ఫుడ్‌ను టేస్ట్ చేసి వాటికి రివ్యూలు ఇస్తోంది. ఇటీవ‌లే ఓ రెస్టారెంట్‌లో సంద‌డి చేసిన ఈమె అక్క‌డి ఫుడ్‌కు 10కి కేవ‌లం 6 మార్కులే ఇచ్చింది. ఇక ఇప్పుడు మ‌ళ్లీ ఇంకో రెస్టారెంట్‌కు వెళ్లి అన్ని నాన్‌వెజ్‌, వెజ్ వంట‌కాల‌ను రుచి చూసింది. అక్క‌డ కొన్ని వంటకాల‌కు ఈమె 10కి 10 మార్కులు ఇవ్వ‌గా.. కొన్నింటికి మాత్రం 6 మార్కుల‌నే ఇచ్చింది.

Sri Reddy again tasted a restaurant food and given review
Sri Reddy

ఇక శ్రీ‌రెడ్డి ఈ మ‌ధ్య వంట‌ల వీడియోల‌తోనే ఎంతో బిజీగా ఉంటోంది. సమాజంలో అనేక సంచ‌ల‌న సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నా వాటిని ఈ అమ్మ‌డు పట్టించుకోవ‌డం లేదు. అప్ప‌ట్లో ఈమె కాస్టింగ్ కౌచ్ ద్వారా ఎంతో పాపుల‌ర్ అయింది. ఈమె ఫిలిం చాంబ‌ర్ ఎదుట అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. త‌రువాత ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సూచ‌న మేర‌కు ప‌వ‌న్‌ను తిట్టింది. ఆ త‌రువాత ప‌వ‌న్ అభిమానుల సెగ‌కు కొంత‌కాలం అంద‌రికీ క‌నిపించ‌కుండా జీవించింది. ఆ త‌రువాత మ‌ళ్లీ య‌థావిధిగా త‌న ప‌నుల‌ను చేయ‌డం ప్రారంభించింది. అయితే ఈమె సామాజిక అంశాల‌పై ఎందుకు స్పందించ‌డం లేదు.. అని కొంద‌రు సందేహిస్తున్నారు. మ‌రి శ్రీ‌రెడ్డి దీనిపై ఆలోచిస్తుందా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now