గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Sreemukhi : రా.. రా.. ర‌క్క‌మ్మ‌.. అంటూ డ్యాన్స్‌తో చిత్తు చేసిన శ్రీ‌ముఖి..!

Sreemukhi : ప్రస్తుతం శ్రీముఖి బుల్లితెర‌పై  ఓ ప్ర‌వాహంలా దూసుకుపోతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కాస్త అటు ఇటుగా ఉన్న ఆమె కెరీర్ చేతినిండా అవ‌కాశాల‌తో అసలు ఖాళీగా లేకుండా ఫుల్ హడావిడి చేస్తోంది. సుమ త‌ర్వాత ఆ రేంజ్…

Sreemukhi : రా.. రా.. ర‌క్క‌మ్మ‌.. అంటూ డ్యాన్స్‌తో చిత్తు చేసిన శ్రీ‌ముఖి..!

Sreemukhi : ప్రస్తుతం శ్రీముఖి బుల్లితెర‌పై  ఓ ప్ర‌వాహంలా దూసుకుపోతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కాస్త అటు ఇటుగా ఉన్న ఆమె కెరీర్ చేతినిండా అవ‌కాశాల‌తో అసలు ఖాళీగా లేకుండా ఫుల్ హడావిడి చేస్తోంది. సుమ త‌ర్వాత ఆ రేంజ్ లో బుల్లితెర‌పై షోలు చేస్తూ దూసుకుపోతోంది. మిగ‌తా యాంక‌ర్ల కంటే ఆమె యాక్టివ్ నెస్ వలన ఆమెకు ఎక్కువ అవ‌కాశాలు అందిపుచ్చుకుంటోంది. ఇండస్ట్రీలో స్థిరపడాలన్న లక్ష్యంతో శ్రీముఖి వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి చిత్రంతో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ. ఆ తర్వాత నేను శైలజ, జెంటిల్‌మెన్ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్, బాబు బాగా బిజీ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి పాపులర్ అయిపోయింది.

బుల్లితెరపై అదుర్స్ షోతో హోస్టుగా మారిన శ్రీముఖి, ఆ తర్వాత మనీ మనీ, సూపర్ మామ్, సూపర్ సింగర్, జోలకటక, పటాస్ వంటి షోలు చేసి యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. శ్రీముఖి వేసే పంచ్ లకు సైతం ఎంతవారైనా సరే నోరుముయ్యివలసిందే. ఈటీవీలో జాతి రత్నాలు, జీ తెలుగులో సింగింగ్ షోలకు హోస్ట్ గా చేస్తూ కెరియర్ లో ఫుల్ బిజీగా ఉంది.

Sreemukhi danced for rakkamma song video viral
Sreemukhi

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పాట అందర్నీ ఉర్రూతలూగిస్తోంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ ఈ పాటకు తెగ చిందులు వేసేస్తున్నారు. శ్రీముఖి కూడా ఆ కోవలోకి వచ్చేసింది. రా.. రా.. రక్కమ్మ అంటూ స్టెప్పులు వేసి తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.  ఇక సోషల్ మీడియా లోనూ నిత్యం యాక్టివ్ గా ఉంటూ శ్రీముఖి నెటిజన్లను తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. రా.. రా.. రక్కమ్మ పాటకు తనదైన శైలిలో స్టెప్పులు ఇరగదీసే శ్రీముఖి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో 4 మిలియన్ల పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దీన్ని బట్టి శ్రీముఖి క్రేజ్ ఏ మేరకు ఉందో వేరే చెప్పనవసరం లేదు.  శ్రీముఖి పెట్టిన రా.. రా.. రక్కమ్మ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి