Anchor : ఈ ఫోటోలో ఉన్న చిన్నది ఇప్పుడు టాప్ యాంక‌ర్‌.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!

August 20, 2022 6:43 PM

Anchor : ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తూ ఉండటంతో.. సినిమా సెలబ్రిటీలు, పాపులర్ టీవీ సెలబ్రిటీలు సైతం అభిమానులకు నిత్యం టచ్‌లో ఉంటున్నారు. తమ లేటెస్ట్ అప్‌డేట్స్‌‌‌తోపాటు పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు తమ చిన్నప్పటి ఫోటోలను కూడా అప్పుడప్పుడూ షేర్ చేస్తూ చూసేవారిని ఆశ్చర్యానికి లోను చేస్తున్నారు. వారు షేర్ చేసిన ఫోటోలు క్షణాల్లో నెటింట్లో వైరల్‌ అవుతూ ఉంటాయి. మన హీరోయిన్స్ మాత్రమే కాదు. మన బుల్లితెర నటులు, పాపులర్ యాంకర్ లు సైతం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎంతో దగ్గరవుతున్నారు.

ఇప్పుడు ప్రస్తుతం ఒక సెలబ్రిటీ పోస్ట్ చేసిన ఒక ఫోటో నెటింట్లో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో చూడ్డానికి ముద్దుగా ఉన్న బూరె బుగ్గల చిన్నది ఎవరో గుర్తుపట్టండి. ఈమె మన తెలుగు టాప్ యాంకర్ ల‌లో ఒకరు. ఎంత గొప్ప కమెడియన్ కైనా తనదైన శైలిలో పంచులు వేస్తూ నోరు మూయిస్తుంది. డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడానికి కూడా వెనుకాడదు. ఈమెను గుర్తు పట్టాలంటే మీకు ఇంకో చిన్న క్లూ.. ఈమె అల్లు అర్జున్ చెల్లెలుగా ఒక చిత్రంలో కూడా నటించింది. ఇంకా గుర్తుపట్టలేదా..

Anchor Sreemukhi childhood photo viral on social media
Anchor

ఆవిడే మన మాటల సునామి శ్రీముఖి. శ్రీముఖి తన అందం, అభినయంతో అటు వెండితెర ప్రేక్షకులను, గల గల మాట్లాడే వాక్చాతుర్యంతో ఇటు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. జులాయి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, చంద్రిక, జెంటిల్ మ్యాన్, మాస్ట్రో వంటి ఎన్నో చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ఎన్నో షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం శ్రీముఖి.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న బోళా శంకర్ చిత్రంలో కూడా నటిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now