Viral Video : మందా మజాకా..! మందు తాగి ఈ ఎలుక చేసిన రచ్చ చూడండి..!

August 11, 2022 7:34 PM

Viral Video : ఇంటర్నెట్ లో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. కొన్ని వీడియోల‌ను చూసిన తర్వాత కూడా నమ్మలేనివిగా ఉంటాయి. ఎలుక, పిల్లికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మందు తాగితే మ‌నుషుల‌కే కాదు జంతువుల‌కు కూడా కిక్కు ఇస్తుంద‌ని నిరూపించింది ఓ ఎలుక‌. పిల్లుల కంటే ఎలుకలు ఎప్పుడూ బలహీనంగా ఉంటాయి. ఎలుకలు పిల్లులకు భయపడి పారిపోతుంటాయి. కానీ ఈ వీడియోలో మాత్రం రివర్స్ అయింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ ఇంట్లో ఓ గ్లాస్‌లో మ‌ద్యం పోసి ఉంది. ఓ ఎలుక నెమ్మ‌దిగా ఆ గ్లాసు దగ్గరికి వచ్చి అందులో ఉన్న మ‌ద్యాన్ని గ‌ట గ‌టా తాగింది. కొంత సమయం తర్వాత ఆ ఎలుక బాహుబలిగా మారి పిల్లుల‌పై దాడి చేసింది. ఎలుక దాడిని తట్టుకోలేక పిల్లులు అక్కడి నుంచి దూరంగా పారిపోతాయి.

rat drunk and fight with cats Viral Video
Viral Video

కాగా ఆ ఎలుకకు సంబంధించిన ఫన్నీ వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. మద్యం మత్తు ఎలాంటి పనినైనా చేయిస్తుందని చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం. ఇక ఈ వీడియోను చూసిన అందరూ షాక్ అవుతున్నారు. కాగా ఆ బాహుబలి ఎలుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరోవైపు నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now