Rakul Preet Singh : ర‌కుల్ ప్రీత్ సింగ్ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్ర‌మాదం

November 20, 2021 10:56 PM

Rakul Preet Singh : ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం ముంబైలో ఉంటున్న విష‌యం విదిత‌మే. ఇటీవ‌లే నిర్మాత జాకీ భగ్నానీని తాను ప్రేమిస్తున్న‌ట్లు రకుల్ తెలియజేసింది. అయితే ముంబైలో ఈ అమ్మ‌డు ఉంటున్న‌ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది.

Rakul Preet Singh house fire accident

ముంబైలో రకుల్ ప్రీత్ సింగ్ నివాసం ఉండే బిల్డింగ్‌లో 12వ అంత‌స్తులో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ క్ర‌మంలోనే స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డ మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. ర‌కుల్ నివాసం ఎదుట భారీగా అగ్నిమాప‌క వాహ‌నాలు, ఆంబులెన్స్‌లు ఉన్నాయి.

అయితే ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేద‌ని తెలుస్తోంది. ఈ ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇటీవ‌లే వైష్ణ‌వ్ తేజ్ తో క‌లిసి కొండ‌పొలం మూవీలో న‌టించ‌గా.. ఈ మూవీకి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం ద‌క్కాయి. కానీ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం అని టాక్ వ‌చ్చింది. దీంతో పెద్ద‌గా క‌లెక్ష‌న్లు రాలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment