ద‌క్షిణాది సినిమాల‌పై ర‌కుల్ ప్రీత్ సింగ్ వివాదాస్ప‌ద కామెంట్లు.. అంత పొగ‌రు ఎందుకంటున్న నెటిజ‌న్లు..

November 8, 2022 9:54 PM

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరు గురించి తెలియ‌ని వారుండ‌రు. టాలీవుడ్‌లో అగ్ర యంగ్ హీరోల స‌ర‌స‌న న‌టించిన ఈ ముద్దు గుమ్మ గ‌త కొన్నేళ్లుగా బాలీవుడ్‌లోనే స్థిర‌ప‌డిపోయింది. అక్క‌డే మూవీలు చేస్తోంది. ఆమె న‌టించిన 5 బాలీవుడ్ మూవీలు వ‌రుస‌గా ఫెయిల్ అయ్యాయి. అయిన‌ప్ప‌టికీ ఆమె చేతిలో 5 మూవీలు ఉండ‌డం విశేషం. తెలుగులో చిన్న సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ర‌కుల్ అన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. టాలీవుడ్‌లో యంగ్ హీరోలు దాదాపు అంద‌రితోనూ ఈమె యాక్ట్ చేసింది. స్టార్ బ్యూటీగా మారింది. త‌క్కువ కాలంలోనే ఈమెకు ఎక్కువ పేరు వ‌చ్చింది. అయితే తెలుగులో క‌న్నా హిందీలోనే సెటిల్ అవ‌డం ముఖ్యం అనుకుందో ఏమో కానీ.. ఈమె బాలీవుడ్‌కు మకాం మార్చేసింది. దీంతో స‌హ‌జంగానే తెలుగులో అవ‌కాశాలు త‌క్కువ‌య్యాయి.

అయితే ర‌కుల్ ప్రీత్ సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం అయ్యాయి. ఈ మ‌ధ్య కాలంలో సౌత్ నుంచి వ‌చ్చిన చిత్రాలు హిందీ మార్కెట్‌లో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలుగా నిలుస్తున్నాయి. హిందీ మార్కెట్ సౌత్ సినిమా కాప్చ‌ర్ చేసింది. దీంతో బాలీవుడ్‌లో కొందరు వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా త‌మ అక్క‌సును వెళ్ల‌గ‌క్కుతూనే ఉన్నారు. తాజాగా ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా సౌత్ మూవీల‌ను కాద‌ని.. బాలీవుడ్‌ను వెన‌కేసుకు వ‌చ్చింది. దీంతో నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. అయితే ఇంత‌కీ ఆమె ఏమ‌ని కామెంట్స్ చేసిందంటే..

rakul preet singh controversial comments on south film industry

ఈ మ‌ధ్య‌కాలంలో నార్త్‌ను సౌత్ చంపేసింద‌ని, సౌత్ సినిమాల వ‌ల్ల బాలీవుడ్ ప‌త‌నం మొద‌లైంద‌ని.. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ ప‌నైపోయింద‌ని అంటున్నారు. బాలీవుడ్ ఇక ఎద‌గ‌లేదు.. ఫిలిం ఇండ‌స్ట్రీకి సౌత్ మూవీలే ప్రాణం పోస్తున్నాయి.. అంటున్నారు.. కానీ దీన్ని నేను ఒప్పుకోను.. అని ర‌కుల్ ప్రీత్ సింగ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది. నార్త్.. సౌత్‌.. అంతా ఒక్క‌టే అని.. అలాంటి కామెంట్లు చేయ‌కూడ‌ద‌ని.. కంటెంట్ ఉంటే ఏ సినిమాను అయినా స‌రే ఆద‌రించాల‌ని.. ఏదో ఒక రోజు బాలీవుడ్ ఇండ‌స్ట్రీ కూడా మ‌ళ్లీ పైకి ఎగ‌బాకుతుంద‌ని.. అన్ని ఇండ‌స్ట్రీలు క‌ల‌సి పోతాయ‌ని.. ర‌కుల్ కామెంట్స్ చేసింది.

అయితే ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇలా బాలీవుడ్‌ను వెన‌కేసుకు రావ‌డం చాలా మంది నెటిజ‌న్ల‌కు న‌చ్చ‌డం లేదు. సౌత్ మూవీల ద్వారా పాపుల‌ర్ అయి ఈ ఇండ‌స్ట్రీని త‌క్కువ చేసి చూడ‌డం స‌రికాద‌ని.. నెటిజ‌న్లు ర‌కుల్‌కు హిత‌వు చెబుతున్నారు. నువ్వు బాలీవుడ్‌లో యాక్ట్ చేస్తున్నావ‌ని.. ఆ ఇండ‌స్ట్రీని ఎక్కువ చేసి మాట్లాడ‌డం త‌గ‌ద‌ని అంటున్నారు. సౌత్ ఫిలిమ్స్‌లో అస‌లు ర‌కుల్‌కు చాన్స్‌లు ఇవ్వ‌ద‌ని కూడా కోరుతున్నారు. ఇక ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం హిందీలో వ‌రుస మూవీల‌తో బిజీగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now