Prabhudeva Wife : న‌య‌న‌తారను కొడ‌తానంటున్న ప్ర‌భుదేవా భార్య‌..!

June 9, 2022 4:22 PM

Prabhudeva Wife : లేడీ సూప‌ర్ స్టార్‌గా ఎంతో పేరు తెచ్చుకున్న న‌య‌న‌తార గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె కెరీర్ మొద‌ట్లో ఎన్నో చిత్రాల్లో గ్లామ‌ర్ షో చేసింది. కానీ విగ్నేష్ శివ‌న్‌తో ప్రేమ‌లో ప‌డిన‌ప్ప‌టి నుంచి కేవ‌లం లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌ను మాత్ర‌మే చేస్తూ గ్లామ‌ర్ షోకు గుబ్ బై చెప్పింది. అయితే విగ్నేష్ శివ‌న్‌ను నాలుగేళ్ల నుంచి ప్రేమిస్తున్న న‌య‌న‌తార ఎట్ట‌కేల‌కు వివాహం చేసుకుంది. వీరి వివాహం సెల‌బ్రిటీల మ‌ధ్య మ‌హాబ‌లిపురంలోని గ్రాండ్ షెర‌టాన్ హోట‌ల్‌లో ఘ‌నంగా జ‌రిగింది. అయితే న‌య‌న‌తార వివాహం ఏమోగానీ.. గ‌తంలో ప్ర‌భుదేవా భార్య రామ్లాత్ ఒక‌సారి న‌య‌న‌తార‌పై చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

విగ్నేష్ శివ‌న్‌తో ప్రేమ‌లో ప‌డ‌క‌ముందు న‌య‌న‌తార ప్ర‌భుదేవాను ప్రేమించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆమెను పెళ్లి చేసుకునేందుకు ప్ర‌భుదేవా త‌న భార్య రామ్లాత్ కు విడాకులు కూడా ఇచ్చాడు. దీంతో వీరి పెళ్లి పీట‌ల వ‌ర‌కు వ‌చ్చింది. కానీ ఏం జ‌రిగిందో తెలియ‌దు.. వీరి పెళ్లి ఆగిపోయింది. త‌రువాత ఆమె మ‌ళ్లీ యథావిధిగా సినిమాలు చేసుకుంటూ కొంత‌కాలం గ‌డిపింది. అనంత‌రం విగ్నేష్ శివ‌న్‌తో ప్రేమ‌లో ప‌డింది. అయితే ప్ర‌భుదేవా త‌న భార్య రామ్లాత్ కు విడాకులు ఇచ్చిన‌ప్పుడు ఆమె న‌య‌న‌తార గురించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

Prabhudeva Wife Ramlath said she will face Nayanthara
Prabhudeva Wife

న‌య‌న‌తార త‌న కాపురాన్ని కూల్చేసింద‌ని.. రామ్లాత్ ఆరోప‌ణ‌లు చేసింది. త‌న బ‌తుకు రోడ్డున ప‌డేందుకు కార‌ణం న‌య‌న‌తార అని.. త‌న భ‌ర్త‌ను త‌న‌కు దూరం చేసింద‌ని పేర్కొంది. త‌న భ‌ర్త త‌న‌తో 15 ఏళ్ల నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాడ‌ని.. ఆమె కోస‌మే త‌న‌కు విడాకులు ఇచ్చాడ‌ని ఆమె వాపోయింది. త‌మ జీవితాల్లో ఆమె చిచ్చు పెట్టింద‌ని పేర్కొంది. త‌న భ‌ర్త త‌న‌ను దేవ‌త‌లా చూసుకునేవాడ‌ని.. ఆమె మాయ‌లో ప‌డి త‌న‌కు విడాకులు ఇచ్చాడ‌ని ఆమె ఆరోప‌ణ‌లు చేసింది. అయితే న‌య‌న‌తారను దేవుడు క్ష‌మించ‌డ‌ని.. త‌నకు ఆమె చిక్కితే క‌చ్చితంగా ఆమెను కొడ‌తాన‌ని.. రామ్లాత్ పేర్కొంది. ఈ క్ర‌మంలోనే న‌య‌న‌తార పెళ్లి నేపథ్యంలో రామ్లాత్ అన్న మాట‌లు మ‌ళ్లీ వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now