శనివారం, జూన్ 27, 2026
వార్తలు

Peddanna Movie : ఓటీటీలో సందడి చేయనున్న రజినీకాంత్ పెద్దన్న.. ఎప్పటినుంచంటే!

Peddanna Movie : సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా నటించిన చిత్రం “అన్నాతై”. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో పెద్దన్న అనే టైటిల్ తో విడుదల అయింది. ఈ సినిమా నవంబర్ 4వ తేదీ…

Peddanna Movie : ఓటీటీలో సందడి చేయనున్న రజినీకాంత్ పెద్దన్న.. ఎప్పటినుంచంటే!

Peddanna Movie : సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా నటించిన చిత్రం “అన్నాతై”. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో పెద్దన్న అనే టైటిల్ తో విడుదల అయింది. ఈ సినిమా నవంబర్ 4వ తేదీ దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషలలో విడుదలైంది. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ చెల్లెలి పాత్రలో కీర్తిసురేష్ నటించిన సంగతి తెలిసిందే.

Peddanna Movie to stream on ott

రజనీకాంత్ నటించిన పెద్దన్న సినిమా థియేటర్లో ప్రేక్షకులను పెద్దగా సందడి చేయలేకపోయినప్పటికీ పెద్ద ఎత్తున కలెక్షన్లను వసూలు చేసింది. ఈ క్రమంలోనే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో ప్రసారం కానుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్, ప్రశాంత్ రాందాస్ సంయుక్తంగా నిర్మించారు.

శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 26వ తేదీ నుంచి సన్ నెక్స్ట్ లో ప్రసారం కానుంది. ఇక ఇందులో ఖుష్బూ, మీనా, జగపతి బాబు ప్రధాన పాత్రలలో నటించారు. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా ఈ సినిమా ఓటీటీలో అయినా ప్రేక్షకులను సందడి చేస్తుందో లేదో తెలియాల్సి ఉంది.

కాగా రజనీకాంత్‌ ఇటీవలే చెన్నైలో కొన్ని రోజులపాటు హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. పలు అనారోగ్య సమస్యల కారణంగా ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి