Niharika Konidela : నిహారిక ఇక‌పై చేయ‌బోయే ప‌ని అదే.. భ‌లే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది..!

May 9, 2022 10:21 PM

Niharika Konidela : మెగా డాట‌ర్ నిహారిక ఈమ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలిచింది. ఫిబ్ర‌వ‌రి నెల‌లో ఈమె ఉన్న‌ట్టుంది స‌డెన్‌గా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేసింది. అయితే ఈ మ‌ధ్యే ఆ ఖాతాను యాక్టివేట్ చేసింది. కానీ త‌న జిమ్ ట్రెయిన‌ర్‌తో క‌ల‌సి ఉన్న వీడియో మాత్రం ఆమె ఖాతాలో కనిపించ‌లేదు. దీంతో ఆమె ఆ వీడియోను డిలీట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. దానివ‌ల్లే త‌న అత్తింటి వారి నుంచి ఆమె విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంద‌ని స‌మాచారం. క‌నుక‌నే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తాత్కాలికంగా బ్లాక్ చేసింద‌ని.. త‌రువాత యాక్టివేట్ చేసినా ఆ వీడియో లేదు క‌నుక అంద‌రూ అనుకున్న‌ట్లుగానే జ‌రిగి ఉంటుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ విష‌య‌మే కాకుండా.. ఆమె పేరు డ్ర‌గ్స్ కేసులో విన‌బ‌డ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

నిహారిక.. ఇంకొంత‌మంది సెల‌బ్రిటీల పిల్లలు ప‌బ్‌లో దొర‌కడం.. ఆ స‌మ‌యంలో డ్ర‌గ్స్ ల‌భించ‌డంతో ఆమె కూడా డ్ర‌గ్స్ తీసుకుంద‌ని అనుకున్నారు. కానీ నాగ‌బాబు ఈ విష‌యంలో క్లారిటీ ఇచ్చారు. కేవ‌లం పార్టీ కోస‌మే అక్క‌డికి వెళ్లింది కానీ త‌న కుమార్తె ఎలాంటి డ్ర‌గ్స్‌ను తీసుకోలేద‌ని ఆయ‌న అన్నారు. అయిన‌ప్ప‌టికీ తెలుగు పండుగ ఉగాది రోజు అర్థ‌రాత్రి పూట భ‌ర్త లేకుండా ఆమె ప‌బ్‌లో ఏం చేస్తుంద‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నించారు. దీనికి ఆయ‌న వ‌ద్ద స‌మాధానం లేకుండా పోయింది. అయితే అదంతా గ‌తం. ఇక‌పై నిహారిక కొత్త కొత్త‌గా క‌నిపించ‌నుంది. ఈ విష‌యాన్ని ఇటీవ‌లే ఆమె ఓ పోస్టులో తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు సరికొత్త అనుమానాల‌కు తావిస్తున్నాయి.

Niharika Konidela may do a travel show very soon
Niharika Konidela

నిహారిక ఆమె భ‌ర్త జేవీ చైత‌న్యతో క‌లిసి జోర్డాన్‌కు టూర్ వెళ్లారు. అక్క‌డ ఆకాశంలో విహ‌రిస్తూ వీడియోలు తీసుకున్నారు. ఐఫోన్‌ల‌తోపాటు డీఎస్ఎల్ఆర్ కెమెరాల‌తో ఫొటోలు, వీడియోల‌ను చిత్రీక‌రించారు. దీంతో ఓ ఆస‌క్తిక‌ర‌మైన స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. నిహారిక త్వ‌ర‌లోనే ఓ ట్రావెల్ షోలో పాల్గొంటుంద‌ని.. అందుక‌నే ఇలా భ‌ర్త‌తో క‌ల‌సి ప్ర‌స్తుతం విహార యాత్రల‌కు వెళ్తుంద‌ని తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమె త‌న భ‌ర్త‌తో క‌ల‌సి ముందుగా ప‌లు దేశాల్లో విహ‌రిస్తుంద‌ని.. వాటి తాలూకు వీడియోల‌తో ఓ షో చేస్తుంద‌ని తెలుస్తోంది.

ఇక ఆ షోను ఓ ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ స్ట్రీమ్ చేస్తుంద‌ని.. హిందీలో ఓ నేష‌న‌ల్ టీవీలోనూ ఆ షోను టెలికాస్ట్ చేస్తార‌ని తెలుస్తోంది. అయితే ఇదంతా విశ్వ‌స‌నీయ స‌మాచార‌మే. దీని గురించి త్వ‌ర‌లో వివ‌రాల‌ను వెల్ల‌డిస్తారేమో చూడాలి. నిజంగా ఇది క‌రెక్టే అయితే నిహారిక షోకు మంచి రేటింగ్స్ వ‌స్తాయ‌ని అంటున్నారు. మ‌రి ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విష‌యం తెలియాల్సి ఉంది. ఇక నిహారిక ప్ర‌స్తుతం త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్‌కు చెందిన సిరీస్‌ల‌తో బిజీగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment