Niharika Konidela : బికినీలో షాకిచ్చిన నిహారిక.. హాలిడే ట్రిప్ లో రచ్చ ర‌చ్చ‌..

October 12, 2022 9:17 PM

Niharika Konidela : మెగాబ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్‌గా కెరీర్‌గా మొదలుపెట్టిన నిహారిక ఒక మనసు చిత్రంతో హీరోయిన్‌గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌తో బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలోనూ సందడి చేస్తుంటుంది. పెళ్లి తర్వాత నిర్మాతగా మారిన నిహారిక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న తెలిసిందే. నిహారిక గురించి తరచుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అలాగే ఆమె కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకుంటూనే ఉంది. ఆ మధ్యన ఓ పబ్ లో డ్రగ్స్ రైడ్ లో నిహారిక పేరు కూడా వినిపించింది.

అయితే నిహారిక ఆ పబ్ కి కేవలం పార్టీ కోసమే వెళ్లిందని.. పోలీసులు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చారు. పెళ్లి తర్వాత కూడా నిహారిక జోరు తగ్గడం లేదు. సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్, జిమ్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తోంది. కానీ ఎప్పుడూ ఈ మెగా డాటర్ బికినిలో కనిపించలేదు. ఊహించని విధంగా నిహారిక తాజాగా బికినీలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. మెగా డాటర్ కాబట్టి విమర్శలు వస్తాయని తెలిసినా నిహారిక ఇలా బికినిలో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. నిహారిక ఇటీవల టర్కీకి తన ఫ్రెండ్స్ తో కలసి హాలిడే ట్రిప్ కి వెళ్ళింది.

Niharika Konidela holiday trip photos viral
Niharika Konidela

టర్కీలో హాలిడే ఎంజాయ్ చేస్తూ ఇలా అక్కడ ఒక స్ట్రేంజర్ గర్ల్ తో బికినీలో సెల్ఫీకి ఫోజు ఇచ్చింది. ఆ అమ్మాయి పేరు ఇలోన. నువ్వు మాట్లాడింది నాకు ఏమాత్రం అర్థం కాలేదు. కానీ నీతో ఉన్నంతసేపు సరదాగా అనిపించింది. మళ్ళీ కలుస్తామేమో చూద్దాం అంటూ నిహారిక ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నిహారిక బికినిలో కనిపించడంతో విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్స్. బికినీలో ఇలా ఫోటోలు బహిర్గతం చేయడం అవసరమా అంటూ కొందరు విమర్శిస్తుంటే.. మరి కొందరు మాత్రం హాలిడే ట్రిప్ లో ఎంజాయ్ చేస్తే తప్పేముంది అంటూ సమర్థిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment