Neha Sharma : పెళ్లి పీటలెక్కనున్న చిరుత బ్యూటీ.. నేహాశర్మ పెళ్లి చేసుకోనుంది ఆయ‌న‌నే..?

September 11, 2022 11:21 AM

Neha Sharma : మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో మెగా పవర్‌స్టార్ రాంచరణ్ డెబ్యూ మూవీ చిరుతతో తెరంగేట్రం చేసింది బీహార్ బ్యూటీ నేహాశర్మ. ఫస్ట్ మూవీలోనే అందాల ఆరబోత గట్టిగా చేసి ఆకట్టుకుంది. మొదటి చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ఆ వెంటనే ఈమెకు వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు అనే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో తర్వాత టాలీవడ్ లో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. అనంతరం బాలీవుడ్ లో క్రూక్, తేరీ మేరీ కహానీ వంటి సినిమాల్లో నటించింది.

అవి కూడా నేహాకు మంచి పేరుని తెచ్చిపెట్టలేదు. తమిళ్, పంజాబీ సినిమాల్లో నటించింది కానీ అవి కూడా ఈమెకు కలిసి రాలేదు. తన గ్లామర్ ను మాత్రం అలాగే మెంటైన్ చేస్తూ వస్తుంది. ఫస్ట్ మూవీలో ఎలాగైతే ఉందో.. ఇప్పటికి అదే గ్లామర్ తో రచ్చ చేస్తుంది నేహాశర్మ. ప్రస్తుతం ఈమెకు అవకాశాలు లేవనే చెప్పాలి. దానికి కారణం అమ్మడు స్టోరీ సెలక్షన్ బాగా లేకపోవడం వల్లనే అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో.. నేహాశర్మ ట్రెండింగ్ టాపిక్ అయ్యింది.

Neha Sharma reportedly getting married
Neha Sharma

హాట్ ఫోటోషూట్స్ చేస్తున్న నేహాశర్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని తెలుస్తుంది. ఆమె పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు బాలీవుడ్ ప్రొడ్యూసర్.. అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఓ యంగ్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ తో డేటింగ్ లో ఉన్న నేహాశర్మ త్వరలోనే పెళ్లి చేసుకొని ఓ ఇంటిది కాబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఏదైతేనేం పెళ్లి చేసుకొని ఒక ఇంటిది కాబోతోంది నేహా శర్మ అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎలాగూ సినిమాలు లేవు, పెళ్లి చేసుకొని అయినా సెటిల్ అవ్వు నేహా.. అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now