Nayanthara : నయనతారకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాకవుతారు.. సొంతంగా అది కూడా ఉందా..?

September 18, 2022 6:27 PM

Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలే ఎప్పుడూ చర్చనీయాంశం అవుతున్నాయి. వీటన్నింటికి తెర దించుతూ ఎట్టకేలకు నయన్.. డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకుని అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టింది. కొన్ని రోజులు భర్తతో హనీమూన్ కి వెళ్లి వచ్చిన అనంతరం మళ్లీ షూటింగ్ లో బిజీ అయింది నయనతార. అయితే ప్రస్తుతం నయన్ రెమ్యూనరేషన్ గురించి చర్చ జరుగుతుంది. బాలీవుడ్‌కి చెందిన దీపికా పదుకొణె మరియు అలియా భట్‌లను అధిగమించి దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే సూపర్‌స్టార్ నటి నయన్ అని టాక్ న‌డుస్తోంది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం నయన్ ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే.. ఆమె ఆస్తి విలువ దాదాపు రూ.165 కోట్లు ఉందట. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉంటుంది. ఇందుకుగానూ ఒక్కో సంస్థ నుంచి రూ. 5 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. అలాగే ఆమెకు హైదరాబాద్ లో రెండు ఖరీదైన బంగ్లాలు, చెన్నైలో ఆధునాతన‌ వసతులతో కూడిన నాలుగు ప్లాట్లు, కేరళలోని తన తల్లిదండ్రులు నివసిస్తున్న ఇల్లు.. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సొంత ఇళ్లను ఏర్పాటు చేసుకుందట.

Nayanthara assests and their values she has own jet
Nayanthara

హైదరాబాద్ లోని ఒక్కో ప్లాట్ సుమారు రూ.15 కోట్లు విలువ చేస్తుందట. అంతేకాకుండా ఆమెకు ప్రత్యేకంగా ఒక జెట్ విమానం కూడా ఉందని సమాచారం. ఇక గత కొద్ది రోజులుగా నయన్ సినిమాల కంటే బిజినెస్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు కంపెనీలతో భాగస్వామ్యం కూడా ఏర్పర్చుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నయన్.. డైరెక్టర్ అట్లీ, షారుఖ్ ఖాన్ కాంబోలో రాబోతున్న జవాన్ చిత్రంలో నటిస్తుంది. మెగాస్టార్ చిరు యొక్క గాడ్ ఫాదర్ లో నటించింది. అలాగే ప్రేమమ్ దర్శకుడి తదుపరి చిత్రం గోల్డ్ లో నటించనుంది నయనతార.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now