గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Nayanthara : సరోగ‌సీ యాక్ట్‌.. న‌య‌న‌తార దంప‌తుల‌కు 5 ఏళ్ల జైలు శిక్ష‌..?

Nayanthara : నయనతార – విఘ్నేశ్​ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. తమకు ఇద్దరు మగ పిల్లలు జన్మించారంటూ ఇటీవలే సోషల్​మీడియా ద్వారా తెలిపారు. అయితే దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఎందుకంటే వీరికి పెళ్లై…

Nayanthara : సరోగ‌సీ యాక్ట్‌.. న‌య‌న‌తార దంప‌తుల‌కు 5 ఏళ్ల జైలు శిక్ష‌..?

Nayanthara : నయనతార – విఘ్నేశ్​ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. తమకు ఇద్దరు మగ పిల్లలు జన్మించారంటూ ఇటీవలే సోషల్​మీడియా ద్వారా తెలిపారు. అయితే దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఎందుకంటే వీరికి పెళ్లై ఇంకా 4 నెలలే అవుతోంది. అందులోనూ వీరు సరోగసి ద్వారా తల్లిదండ్రులు అయ్యారు. దీంతో వారిద్దరిపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. అలాగే తమకు పిల్లలు ఎలా పుట్టారో వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతులకు నోటీసులు జారీ చేసింది. నిజంగా సరోగసీ పద్దతిలో నయనతార పిల్లల్ని కన్నట్లైతే వారికి శిక్ష తప్పేలా లేదు.

చట్ట ప్రకారం.. పెళ్ళైన దంపతులు, విడాకులు తీసుకున్న, భర్త చనిపోయిన ఒంటరి మహిళలు సరోగసీ పద్దతిలో పిల్లల్ని కనవచ్చు. నయనతార-విగ్నేష్ 7 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పెళ్ళికి 5 నెలల ముందే సరోగసీని వీరు ఆశ్రయించినట్లు తెలుస్తుంది. సరోగసీ నిబంధనలు నయనతార దంపతులు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సరోగసీ చట్టం 2021 ప్రకారం నయనతార-విగ్నేష్ లకు రూ. 50 వేల జరిమానా, 5 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఈ క్రమంలో నయనతార దంపతులు న్యాయపరమైన సలహాల కోసం లాయర్లను ఆశ్రయిస్తున్నారట.

Nayanthara and Vignesh Shivan may face 5 years of imprisonment
Nayanthara

పెళ్ళైన తర్వాత కూడా సరోగసీ పద్దతిలో పిల్లల్ని కనడానికి నిబంధనలు ఉన్నాయి. భార్యాభర్తలు పిల్లల్ని కనడానికి అనుకూల పరిస్థితులు లేకపోతేనో, ఆరోగ్య కారణాలతోనో వైద్యుల అనుమతితో మాత్రమే సరోగసీని ఆశ్రయించాలి. గతంలో విదేశీయులు అద్దె గర్భం కోసం ఇండియన్ మహిళలను సంప్రదించేవారు. ఇది వ్యాపారంగా మారిపోవడంతో ఇండియన్ గవర్నమెంట్ విదేశీలకు ఇండియాలో సరోగసీ విధానాన్ని రద్దు చేసింది. దీనికి సహకరించిన వైద్యులు, హాస్పిటల్ యాజమాన్యం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. వారు లక్ష రూపాయల ఫైన్, 10 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి