Saami Song : వామ్మో.. ర‌ష్మిక కన్నా ఎంతో అద్భుతంగా సామి పాట‌కు డ్యాన్స్ చేశాడు..!

April 13, 2022 2:36 PM

Saami Song : అల్లు అర్జున్‌, సుకుమార్‌ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పుష్ప తొలి పార్ట్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీకి ఇప్ప‌టికీ ఇంకా క్రేజ్ త‌గ్గ‌లేదు. ఇందులోని డైలాగ్‌ల‌ను చాలా మంది అనుక‌రిస్తున్నారు. అలాగే పాట‌ల‌కు స్టెప్పులు కూడా వేస్తున్నారు. అల్లు అర్జున్ చేసిన శ్రీ‌వ‌ల్లి పాట డ్యాన్స్‌ను ఇప్ప‌టికే చాలా మంది చేశారు. అలాగే ర‌ష్మిక మంద‌న్న సాంగ్ అయిన సామి సామి పాటకు ఆమె వేసిన విధంగానే హీరోయిన్లు, బుల్లితెర న‌టీమ‌ణులు స్టెప్పులు వేసి అల‌రించారు. అయితే ఈ పాట‌కు ఒక వ్య‌క్తి డ్యాన్స్ చేయ‌డం విశేషం. అది కూడా మ‌హిళ‌లు ధ‌రించే దుస్తుల‌ను ధ‌రించి అత‌ను సామి పాట‌కు డ్యాన్స్ చేశాడు. దీంతో అత‌ని వీడియో వైర‌ల్‌గా మారింది.

man danced for Pushpa movie Saami Song viral video
Saami Song

అమెరికాలోని న్యూయార్క్‌లో నివాసం ఉండే జైనిల్ మెహ‌తా అనే కొరియోగ్రాఫ‌ర్ ఎన్నాళ్ల కింద‌టో అక్క‌డ సెటిల్ అయ్యారు. ఆయ‌న‌ది ఇండియాలోని గుజ‌రాత్‌. అయితే అక్క‌డ ఆయ‌న కొరియోగ్ర‌ఫీ చేస్తుంటారు. ఇక చిన్న‌ప్ప‌టి నుంచి మ‌హిళ‌లు ధ‌రించే దుస్తులు వేసుకుని డ్యాన్స్‌లు చేయ‌డం అంటే ఎంతో ఇష్టం. అందువ‌ల్లే ఆయ‌న డ్యాన్స్ నేర్చుకుని కొరియోగ్రాఫ‌ర్ అయ్యారు. ఇక త‌ర‌చూ మ‌హిళ‌ల దుస్తుల‌ను ధ‌రిస్తూ వారి లాగే ఆయ‌న డ్యాన్స్‌లు చేస్తున్నాడు. అందులో భాగంగానే ఆ వీడియోల‌ను కూడా ఆయ‌న త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Jainil Mehta (@jainil_dreamtodance)

ఇక జైనిల్ టాలెంట్‌కు అంద‌రూ ఫిదా అవుతున్నారు. అత‌ను చేసే డ్యాన్స్ అలా ఉంటుంది మ‌రి. తాజాగా ఆయ‌న పుష్ప‌లోని సామి పాట‌కు డ్యాన్స్ చేసి అల‌రించారు. ఎంత‌లా అంటే ర‌ష్మిక మంద‌న్న క‌న్నా కూడా బాగా చేశాడు. శ‌రీరాన్ని స్ప్రింగులా వంచుతూ మ‌హిళ‌లకే సాధ్యం కాని రీతిలో డ్యాన్స్ చేశాడు. అలా అత‌ను పుష్పలోని సామి పాట‌కు చేసిన డ్యాన్స్ వీడియో ఆక‌ట్టుకుంటోంది. దాన్ని త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయ‌గా.. ఆ వీడియో వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టికే ఆ వీడియోకు 2.6 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్‌, 32వేల‌కు పైగా లైక్స్ వచ్చాయి. జైనిల్ డ్యాన్స్ ను చూసి అంద‌రూ అత‌న్ని ప్ర‌శంసిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment