గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Aishwarya Rai : ఐశ్వ‌ర్యారాయ్ ప్రెగ్నెంటా.. సాక్ష్యం ఈ వీడియోనా ?

Aishwarya Rai : నటిగా, బచ్చన్‌ కుటుంబానికి కోడలిగా, మంచి భార్యగా, తల్లిగా త‌న వంతు బాధ్య‌త‌ల‌ను సక్ర‌మంగా నిర్వ‌ర్తిస్తున్న అందాల ముద్దుగుమ్మ ఐశ్వ‌ర్య‌రాయ్. వ‌య‌స్సు పెరుగుతున్నా కూడా ఈ నీలి కళ్ల సుందరి వ‌న్నె మాత్రం త‌గ్గడం…

Aishwarya Rai : ఐశ్వ‌ర్యారాయ్ ప్రెగ్నెంటా.. సాక్ష్యం ఈ వీడియోనా ?

Aishwarya Rai : నటిగా, బచ్చన్‌ కుటుంబానికి కోడలిగా, మంచి భార్యగా, తల్లిగా త‌న వంతు బాధ్య‌త‌ల‌ను సక్ర‌మంగా నిర్వ‌ర్తిస్తున్న అందాల ముద్దుగుమ్మ ఐశ్వ‌ర్య‌రాయ్. వ‌య‌స్సు పెరుగుతున్నా కూడా ఈ నీలి కళ్ల సుందరి వ‌న్నె మాత్రం త‌గ్గడం లేదు. 2007 ఏప్రిల్‌ 20న ఐశ్వర్య రాయ్‌.. అభిషేక్‌ బచ్చన్‌ని వివాహం చేసుకొని బ‌చ్చ‌న్ కోడ‌లిగా వెళ్లింది. 2011 నవంబర్‌ 16న వీరికి ఆరాధ్య జన్మించింది.

is Aishwarya Rai  pregnant what this video shows

గ‌త కొద్ది రోజులుగా ఐశ్వ‌ర్య‌రాయ్ గ‌ర్భ‌వ‌తి అంటూ ప్ర‌చారం న‌డుస్తోంది. అయితే దీనిపై క్లారిటీ అయితే లేదు. కానీ తాజాగా ముంబై విమానాశ్రయంలో ఐశ్వర్యారాయ్, భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్యతో కలిసి మీడియా కంటపడ్డారు.

టెర్మినల్ ప్రవేశద్వారం వద్ద ఉన్న సీఐఎస్ఎఫ్ పర్సన్‌కు తమ ప్రయాణ పత్రాలను చూపించడానికి అభిషేక్ ఆగిపోయాడు. ఆ సమయంలో రిపోర్టర్స్ వారి ఫోటోలను తీయడానికి ప్రయత్నించారు. అప్పుడు కూతురిని దగ్గరకి లాక్కుంది. చేతిలోని హ్యాండ్‌బ్యాగ్‌ని పొత్తి కడుపుకి అడ్డుగా పెట్టుకుంది.

త‌న బెల్లీని మొదటి నుండి దాచుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన ఐష్ ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తి అని చెబుతున్నారు. అందుకు ఈ వీడియోనే సాక్ష్యం అని అంటున్నారు. కాగా, ఐష్ హీరోయిన్ క‌న్నా ముందు మిస్ వ‌ర‌ల్డ్ అనే విష‌యం తెలిసిందే.

1994లో ఐష్‌ ‘మిస్‌ వరల్డ్‌’ కిరీటాన్ని సొంతం చేసుకుంది. అదే ఏడాది సుస్మితా సేన్‌ ‘మిస్‌ యూనివర్స్‌’గా నిలిచింది. ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న తర్వాత ఐష్‌కి సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. 1997లో మణిరత్నం తెరకెక్కించిన ‘ఇరువర్‌’ (ఇద్దరు) సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టింది.

https://www.instagram.com/tv/CWNKeNpjMp8/?utm_source=ig_web_copy_link

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి