Salman Khan : స‌ల్మాన్‌ఖాన్‌, ఐశ్వ‌ర్యారాయ్‌ల పెళ్లి పీట‌ల దాకా వ‌చ్చి ఆగిపోయింది.. ఇవే కార‌ణాలు..?

November 1, 2021 11:07 PM

Salman Khan : బాలీవుడ్‌లో ఒక‌ప్పుడు ఐశ్వ‌ర్యారాయ్‌, స‌ల్మాన్‌ఖాన్ ల జంట అంటే చూడ‌ముచ్చ‌ట‌గా ఉండేది. వీరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవ‌డ‌మే త‌రువాయి, అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో.. బ్రేక‌ప్ చెప్పుకున్నారు. అయితే అస‌లు వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ ఎందుకు వ‌చ్చింది ? ఎందుకు విడిపోయారు ? అనే కార‌ణాలు మాత్రం ఎవ‌రికీ తెలియ‌వు.

why did Salman Khan and aishwarya rai break up may be these are reasons

నాణేనికి రెండు పార్శ్వాలు ఉన్న‌ట్లే.. స‌ల్మాన్‌, ఐశ్వ‌ర్య విడిపోయేందుకు రెండు కార‌ణాల‌ను చెబుతుంటారు. అవేమిటంటే.. త‌న‌తో ఉన్న స‌ల్మాన్ ఖాన్‌ను ఐశ్వ‌ర్య చీటికీ మాటికీ నిందించేద‌ట‌. నీకు నేను కావాలో, నీ కుటుంబం కావాలో తేల్చుకో అని అడిగేద‌ట‌. దీంతో స‌ల్మాన్ ఖాన్ త‌న కుటుంబానికే ప్రాధాన్య‌త‌ను ఇచ్చి ఆమెను వ‌దులుకున్నాడ‌ని టాక్‌.

ఇక వారిద్దరూ విడిపోవ‌డానికి ఇంకో కార‌ణం ఉంది. అది ఐశ్వ‌ర్యారాయ్ వెర్ష‌న్‌. ఆమే స్వ‌యంగా ఈ విష‌యాన్ని చెప్పింది. స‌ల్మాన్ ఖాన్ మ‌ద్యం విప‌రీతంగా సేవిస్తాడ‌ని, ఆ మ‌త్తులో త‌నను శారీర‌కంగా, మాన‌సికంగా.. అన్ని విధాలుగా చిత్ర హింస‌లు పెట్టేవాడ‌ని, అందుక‌నే అత‌ని నుంచి దూరం అయ్యాన‌ని ఐశ్వ‌ర్యారాయ్ చెప్పింది.

అయితే ఇవే కాకుండా.. వారిద్ద‌రూ విడిపోయేందుకు ఇంకో కార‌ణం కూడా అప్ప‌ట్లో తెగ ప్ర‌చారం అయింది. ఐశ్వ‌ర్యారాయ్‌తో ప్రేమ‌లో ఉండ‌గానే స‌ల్మాన్ ఇంకో హీరోయిన్ వెంట ప‌డ్డాడ‌ని.. విష‌యం తెలిసిన ఐశ్వ‌ర్య అత‌న్ని దూరం పెట్టింద‌ని, దీంతో స‌ల్మాన్ ఒక రోజు ఐశ్వ‌ర్య ఇంటికి వెళ్లి ఆమెతో గొడ‌వ‌ప‌డేందుకు య‌త్నించాడ‌ని, కానీ ఆమె త‌లుపు తెర‌వ‌లేద‌ని, త‌రువాత స‌ల్మాన్ ఆమెకు శాశ్వ‌తంగా దూర‌మ‌య్యాడ‌ని.. అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే వీటిలో ఏవి నిజ‌మో, ఏవి అబ‌ద్ద‌మో తెలియ‌దు, కానీ స‌ల్మాన్ మాత్రం బ్యాచిల‌ర్ గానే ఉండిపోయాడు. ఐశ్వ‌ర్యా రాయ్ మ‌రోవైపు అభిషేక్ బ‌చ్చ‌న్‌ను చేసుకుని సంతోషంగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment