iPhone : బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.11,499 కే ఐఫోన్.. త్వర పడండి..

September 21, 2022 1:46 PM

iPhone : ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌ కార్ట్‌ వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ను ప్రకటించింది. ఐఫోన్లను చాలా చవక ధరలకే కొనుగోలు చేసే వీలు కల్పించనుంది. ఈ నెల 23వ తేదీ నుంచి బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ ప్రారంభం కానున్న విషయం విదితమే. అందులో ఐఫోన్‌ ఎస్‌ఈకి చెందిన 2వ, 3వ జనరేషన్‌ ఫోన్లను వినియోగదారులు చాలా తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ ఆఫర్‌కు చెందిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న బిగ్ బిలియన్‌ డేస్‌ సేల్‌లో ఫ్లిప్‌ కార్ట్‌ ఈ ఆఫర్లను అందించనుంది. ఈ సేల్‌లో బాగంగా రూ.39,900 విలువైన ఐఫోన్‌ ఎస్‌ఈ 2వ జనరేషన్‌ను రూ.11,499 ధరకే కొనవచ్చు. ఎలాగంటే.. ఈ ఫోన్‌పై సేల్‌లో రూ.9,401 ఫ్లాట్‌ డిస్కౌంట్‌ను ఇవ్వనున్నారు. దీంతో ఫోన్‌ ధర రూ.30,499కి తగ్గుతుంది. ఇక ఏదైనా ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌ చేస్తే దీనిపై రూ.19వేలు తగ్గుతుంది. దీంతో ఫోన్‌ ధర రూ.11,499 అవుతుంది. ఇలా ఈ ఫోన్‌ను చాలా చవక ధరకే కొనవచ్చు. ఇక ఐఫోన్‌ ఎస్‌ఈ 3వ జనరేషన్‌ ఫోన్‌ ధర కూడా ఇదే పద్ధతిలో తగ్గనుంది. దీంతో ఈ ఫోన్‌ను ఫ్లిప్‌ కార్ట్‌ సేల్‌లో రూ.24,900 కు కొనవచ్చు.

iPhone SE 2nd generation phone available in flipkart sale with massive discount
iPhone

ఇక ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్‌ 13 ఫోన్లపై కూడా భారీ తగ్గింపు ధరలను అందివ్వనున్నారు. ఇటీవలే యాపిల్‌ ఐఫోన్‌ 14 ఫోన్లను రిలీజ్‌ చేసిన విషయం విదితమే. అయితే ఈ విధంగా చేయడంతోపాటు ఐఫోన్‌ 13 ఫోన్ల ధరలను తగ్గించారు. దీంతో ఈ ఫోన్లపై ఫ్లిప్‌ కార్ట్‌ సేల్‌లో మరింత ధర తగ్గించనున్నారు. ఈ క్రమంలోనే ఐఫోన్‌ 13ను ఫ్లిప్‌ కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో ఏకంగా రూ.50వేలకే కొనుగోలు చేయవచ్చు. దీనిపై మొత్తం రూ.20వేలకు డిస్కౌంట్‌ను అందించనున్నారు. కాగా ఫ్లిప్‌కార్ట్‌లో నిర్వహించనున్న బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో ఇంకా అనేక వస్తువులపై తగ్గింపు ధరలను అందించనున్నారు. ఈ సేల్‌ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment