ఐఫోన్‌ 14 వచ్చేస్తోంది.. లీకైన ధర, ఫీచర్ల వివరాలు..

August 4, 2022 10:28 PM

ఐఫోన్‌ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐఫోన్‌ 14 త్వరలోనే రిలీజ్‌ కానుంది. ప్రతి ఏడాది యాపిల్‌ సంస్థ కొత్త ఐఫోన్లను సెప్టెంబర్‌లో లాంచ్‌ చేస్తుందన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది కూడా ఐఫోన్‌ 14 సిరీస్‌ ఫోన్లను సెప్టెంబర్‌లోనే లాంచ్‌ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే ఈసారి నాలుగు మోడల్స్‌ను యాపిల్‌ విడుదల చేస్తుందని తెలుస్తోంది. ఐఫోన్‌ 14, 14 ప్రొ, 14 మ్యాక్స్‌, 14 మ్యాక్స్‌ ప్రొ పేరిట నాలుగు మోడల్స్‌ రిలీజ్‌ కానున్నాయని సమాచారం.

ప్రొ మోడల్స్‌లో యాపిల్‌ కొత్త చిప్‌ సెట్‌ ఎ16 బయానిక్‌ను ఏర్పాటు చేసి అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నాన్‌ ప్రొ మోడల్స్‌లో పాతదైన ఎ15 బయానిక్‌ చిప్‌ను ఏర్పాటు చేశారని సమాచారం. ఈ ఫోన్లను సెప్టెంబర్‌ 6 నుంచి 13 తేదీల మధ్యలో రిలీజ్‌ చేస్తారని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్లలో శాంసంగ్‌ తరహా ఓలెడ్‌ డిస్‌ప్లేలను ఏర్పాటు చేస్తున్నారని సమాచారం.

iphone 14 series phones may launch in September leaked features and price

ఇక ఐఫోన్‌ 14, 14 ప్రొ మోడల్స్‌లో 3200 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 14 మ్యాక్స్‌, 14 మ్యాక్స్‌ ప్రొలలో 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీలను ఏర్పాటు చేశారని సమాచారం. కాగా ఐఫోన్‌ 14 మోడల్స్‌ ప్రారంభ ధర రూ.62వేల నుంచి మొదలవుతుందని తెలుస్తోంది. వీటిని సెప్టెంబర్‌ చివరి వారం నుంచి విక్రయిస్తారని సమాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now