iPhone 14 : బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఐఫోన్ 14ను రూ.21వేల‌కే పొంద‌వ‌చ్చు..!

September 16, 2022 3:12 PM

iPhone 14 : టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ ఈ మ‌ధ్యే ఐఫోన్ 14 సిరీస్‌లో 4 నూత‌న ఫోన్ల‌ను లాంచ్ చేసిన విష‌యం విదిత‌మే. ఐఫోన్ 14, 14 ప్ల‌స్‌, 14 ప్రొ, 14 ప్రొ మ్యాక్స్ పేరిట ఈ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. వీటికి గాను సెప్టెంబ‌ర్ 9వ తేదీ నుంచి ప్రీ ఆర్డ‌ర్స్‌ను ప్రారంభించారు. అయితే శుక్ర‌వారం నుంచి ఈ ఫోన్స్‌కు గాను సేల్స్ ప్రారంభం అయ్యాయి. ఇక ఈ ఫోన్లు ప్ర‌స్తుతం భార‌త్‌లోనూ ల‌భిస్తున్నాయి. అయితే ఐఫోన్ 14 ప్ల‌స్ ఫోన్ మాత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 7 నుంచి అందుబాటులోకి రానుంది. మిగిలిన ఫోన్ల‌ను ప్ర‌స్తుతం వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఇక ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ.79,900 ఉండ‌గా.. ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర రూ.89,900 గా ఉంది. అలాగే ఐఫోన్ 14 ప్రొ ప్రారంభ ధర రూ.1,29,900 కాగా, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ ప్రారంభ ధర రూ.1,39,900 గా ఉంది. మిడ్‌నైట్, బ్లూ, స్టార్‌లైట్, పర్పుల్, ప్రొడక్ట్ రెడ్ క‌ల‌ర్‌, డీప్ ప‌ర్పుల్ త‌దిత‌ర క‌ల‌ర్స్‌లో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ల‌లో యూజ‌ర్ల‌కు అధునాత‌న ఐఓఎస్ 16 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌భిస్తుంది.

iPhone 14 models sales started you can get huge discount in this way
iPhone 14

కొత్త ఐఫోన్ల‌లో ఎమ‌ర్జెన్సీ శాటిలైట్ క‌నెక్టివిటీ ఫీచ‌ర్‌తోపాటు కార్ క్రాష్ డిటెక్ష‌న్ అనే ఫీచ‌ర్‌ను కూడా అందిస్తున్నారు. ఐఫోన్ 14, 14 ప్ల‌స్ ఫోన్లు 128, 256, 512 జీబీ వేరియెంట్ల‌లో ల‌భిస్తుండ‌గా.. ఐఫోన్ 14 ప్రొ, 14 ప్రొ మ్యాక్స్ ఫోన్లు 128, 256, 512జీబీతోపాటు 1టీబీ వేరియెంట్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. ఇక ఐఫోన్ 14 ఫోన్ల‌ను కొనేవారికి ఆకర్షణీయమైన ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొంటే రూ.6,000 వరకు అంటే.. 5 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఫోన్ల‌పై 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అదే పాత ఐఫోన్ మోడల్స్ ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే గ‌రిష్టంగా రూ.58,730 వరకు తగ్గింపు పొందొచ్చు. దీంతో ఫోన్ ధ‌ర బాగా త‌గ్గుతుంది. ఇలా ఎక్స్‌ఛేంజ్ చేస్తే ఐఫోన్ 14 బేస్ మోడ‌ల్‌ను రూ.21వేలకే పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment