IND Vs WI : భార‌త్ వ‌ర్సెస్ వెస్టిండీస్‌.. ఆన్ లైన్ లో మ్యాచ్‌ల‌ను ఎలా చూడాలి..?

July 22, 2022 7:07 PM

IND Vs WI : ఇటీవ‌లే ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న ముగించుకున్న భార‌త్ ప్ర‌స్తుతం వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే విండీస్‌తో భార‌త్ మొత్తం 3 వ‌న్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల‌ను ఆడ‌నుంది. ఈ క్ర‌మంలో మొద‌టి వ‌న్డే మ్యాచ్ శుక్ర‌వారం జ‌ర‌గ‌నుంది. ఇక ఈ సిరీస్‌ను టీవీలో, ఆన్ లైన్‌లో ఏ విధంగా చూడ‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్‌ల‌ను టీవీలో అయితే డీడీ స్పోర్ట్స్‌లో చూడ‌వ‌చ్చు. ఇక ఆన్‌లైన్‌లో అయితే ఫ్యాన్ కోడ్ అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. అందులో ఈ మ్యాచ్‌ల‌న్నింటినీ చూడ‌వ‌చ్చు. అయితే ఈ యాప్‌లో మ్యాచ్‌ల‌ను చూడాలంటే అందుకు స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫ్యాన్ కోడ్ యాప్ లో ప్ర‌స్తుతం వివిధ ర‌కాల స‌బ్‌స్క్రిప్ష‌న్‌ల‌ను అందిస్తున్నారు. రూ.99 చెల్లిస్తే ఇండియా.. వెస్టిండీస్‌తో ఆడే 3 వ‌న్డేలు, 5 టీ20ల‌ను చూడ‌వ‌చ్చు. దీంతో స‌బ్‌స్క్రిప్ష‌న్ ముగుస్తుంది. దీన్నే ఫ్యాన్ కోడ్ యాప్‌లో టూర్ పాస్‌గా అందిస్తున్నారు.

IND Vs WI how to watch matches online
IND Vs WI

ఇక ఫ్యాన్ కోడ్ యాప్‌లో యాడ్స్ లేకుండా మ్యాచ్‌ల‌ను చూడాలంటే అందుకు టూర్ పాస్‌ను రూ.169తో తీసుకోవాల్సి ఉంటుంది. లేదా రూ.199 నెల‌వారీ చందా చెల్లిస్తే కేవ‌లం ఇండియా – విండీస్ మ్యాచ్‌లే కాకుండా ఇత‌ర మ్యాచ్‌ల‌ను కూడా లైవ్‌లో చూడ‌వ‌చ్చు. అలాగే దీనికి ఏడాది రుసుము అయితే రూ.699 అవుతుంది. ఇలా ఫ్యాన్ కోడ్ యాప్‌లో నిర్దిష్ట‌మైన చందాను చెల్లించి మ్యాచ్‌ల‌ను లైవ్‌లో చూడ‌వ‌చ్చు.

అయితే ఆన్‌లైన్‌లోనే ఇంకో ఆప్ష‌న్ కూడా ఉంది. అది జియో టీవీ ఉన్న‌వారికి వ‌స్తుంది. జియో సిమ్‌ను వాడేవారు జియో టీవీ యాప్‌లో డీడీ స్పోర్ట్స్‌ను వీక్షించ‌వ‌చ్చు. ఇలా భార‌త్‌, వెస్టిండీస్ మ్యాచ్ ల‌ను లైవ్ లో చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment