Honey Rose : బాల‌య్య సినిమాలో ఈమెనేనా..? ఎంత అందంగా ఉంది.. ఎవ‌రీ బ్యూటీ..?

May 15, 2022 1:03 PM

Honey Rose : క్రాక్ సినిమా ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని బాల‌య్య‌తో ఓ సినిమా చేస్తున్న విష‌యం విదిత‌మే. ఎన్‌బీకే107 వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో బాల‌కృష్ణ డ్యుయ‌ల్ రోల్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక శృతి హాస‌న్‌ను ఇప్ప‌టికే ఈ సినిమాకు హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే ఇందులో రెండో హీరోయిన్ ను ఎంపిక చేసేందుకు చిత్ర యూనిట్ ఇప్ప‌టికే అనేక ప్ర‌య‌త్నాలు చేసింది. ఓ ద‌శ‌లో సీనియ‌ర్ హీరోయిన్ మీరా జాస్మిన్‌ను తీసుకోవాల‌ని అనుకున్నారు. కానీ ఆ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు.

మీరా జాస్మిన్ వ‌య‌స్సు 40 ఏళ్ల‌కు పైనే. అయిన‌ప్ప‌టికీ ఈ మ‌ధ్య కాలంలో ఆమె చేస్తున్న గ్లామ‌ర్ షో అంతా ఇంతా కాదు. అయితే బాల‌కృష్ణ సినిమాలో న‌టించేందుకు ఈ బ్యూటీ నో చెప్పింద‌ట‌. తాను గ్లామ‌ర‌స్ రోల్స్ చేయాల‌ని అనుకుంటున్నాన‌ని.. బాల‌కృష్ణ సినిమాలో చేయ‌నుంది ఫ్యామిలీ పాత్ర‌. ఫ్లాష్ బ్యాక్‌లో బాల‌కృష్ణ‌కు త‌ల్లిగా చేయాలి. క‌నుక ఆ పాత్ర చేయ‌న‌ని ఆమె చెప్పింద‌ట‌. దీంతో మ‌ళ్లీ హీరోయిన్ వేట మొద‌లు పెట్టారు. అయితే ఎట్ట‌కేల‌కు ఈ మూవీకి రెండో హీరోయిన్‌ను ఎంపిక చేశారు. న‌టి హ‌నీ రోజ్ వ‌ర్గీస్‌ను ఇందులో సీనియ‌ర్ బాల‌కృష్ణకు జోడీగా న‌టింప‌జేయ‌నున్నారు. ఇందుకు ఆమె కూడా ఓకే చెప్పింద‌ట‌. దీంతో త్వ‌ర‌లోనే ఈమె పార్ట్‌ను చిత్రీక‌రించ‌నున్నారు.

Honey Rose confirmed as heroine for Balakrishna movie
Honey Rose

ఇక హ‌నీ రోజ్ వ‌ర్గీస్ తెలుగు తెర‌కు కొత్తేమీ కాదు. గ‌త 14 ఏళ్ల కింద‌ట వ‌చ్చిన శివాజీ ఆల‌యం సినిమాలో ఈమె న‌టించింది. అలాగే ప‌లు తెలుగు చిత్రాల్లోనూ ఈమె న‌టించింది. కానీ పెద్ద‌గా గుర్తింపు రాలేదు. దీంతో ఈమె మ‌ళ‌యాళంలో స్థిర‌ప‌డింది. అక్క‌డ పలు హిట్ చిత్రాల్లో న‌టించింది. దీంతో ఆమెకు అక్క‌డ మంచి గుర్తింపే వ‌చ్చింది. అయితే తెలుగులో ఈ మూవీతో మ‌ళ్లీ ఇక్క‌డికి వ‌చ్చి ఇక్క‌డి సినిమాల్లో ఆఫ‌ర్ల‌ను అందిపుచ్చుకోవాల‌ని ఈ భామ అనుకుంటుంద‌ట‌. అందుక‌నే బాల‌య్య సినిమా అన‌గానే ఠ‌క్కున ఓకే చేసింద‌ట‌. ఇక ఈ మూవీకి అన్న‌గారు అనే టైటిల్‌ను దాదాపుగా ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇందులోంచి విడుద‌లైన బాల‌య్య ఫ‌స్ట్ లుక్ ఇప్ప‌టికే ఫ్యాన్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment